Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి గ్రీన్ కాఫీ గింజల్లో వుండే క్లోరోజెనిక్ యాసిడ్ సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు. రక్తపోటును నియంత్రించడానికి గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది, రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.