Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమానాలు నడపడం నుంచి కార్పొరేట్ ఉద్యోగాల వరకు అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రవేశించారు. దాంతో పనిభారం కూడా పెరిగింది. ఇంటిపనులు, ఆఫీసు పనులు రెండూ స్త్రీలే చూసుకోవాలి. గర్భం దాల్చినట్లయితే తన పనిని, పుట్టబోయే బిడ్డను చూసుకోవాలి. ఇలాంటప్పుడు గర్భిణీ తమ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం, మంచి నిద్ర, వ్యాయామం తప్పనిసరి. అప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా పని చేసే మహిళలు అదనపు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఉద్యోగాలు చేసే గర్భిణీలు తమను తాము ఆరోగ్యంగా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.
మంచి ఆహారాలు: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. ఆఫీసు పని ఉందన్న కారణంతో తిండి ఎప్పుడూ మానేయకూడదు. పోషక విలువలున్న కూరగాయలు, పండ్లు మొదలైన వాటిని సలాడ్‌గా తినవచ్చు. వీటితో పెరుగు, బెల్లం కూడా జోడించవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే చిక్కుళ్ళు, మొలకలు, పాలు, గుడ్లు కూడా తినొచ్చు. వైద్యుల సూచన మేరకు ఒమేగా 3, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.
నిద్ర: శిశువు ఎదుగుదలకు నిద్ర ఉత్తమ ఔషధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర మానేయకండి. సాధారణంగా గర్భధారణ సమయంలో తగినంత నిద్ర లేకపోవడం నిరాశ, ప్రారంభ దశలో మధుమేహం, నెలలు నిండకుండానే పుట్టడం, పిండం అభివద్ధిలో బలహీనతకు దారితీస్తుంది. గర్భిణీలు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.
సౌకర్యవంతమైన దుస్తులు: గర్భధారణ సమయంలో ఆఫీసుకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు. ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది. ఊపిరి ఆడకపోవడానికి కూడా కారణం కావచ్చు. అందుకే నాణ్యమైన కాటన్‌తో చేసిన దుస్తులను ధరించడం మంచిది. అలాగే హీల్స్ వంటి బూట్లు ధరించడం మానుకోండి.
సీటింగ్ చైర్: ఆఫీసులో పనిచేసే వారు సౌకర్యంగా ఉండే కుర్చీలో కూర్చోవాలి. వెన్నునొప్పి, మెడ నొప్పిని నివారించడానికి చిన్న దిండును ఉపయోగించవచ్చు. అలాగే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పని చేయడం మానుకోండి. కాలానుగుణంగా విరామం తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. అలాగే వెలుతురు ఉన్న ప్రదేశంలో కూర్చుని పని చేయడం కంటి చూపుకు మేలు చేస్తుంది.
వ్యాయామాలు: సాధారణంగా ఆఫీస్‌లో పనిచేసే గర్భిణీలు రెగ్యులర్‌గా వర్క్అవుట్ చేయడానికి టెంప్ట్ అవుతారు. అయితే పని వేళల్లో అవసరమైన విరామం తీసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అలాగే వెన్నునొప్పి, తుంటి నొప్పి మొదలైనవాటిని కలిగించదు. 1 గంటకు 5 నిమిషాల విరామం తీసుకోవడం మంచిది. అలాగే కాలానుగుణంగా మీ కాళ్లను చాచి వంచండి. అలసిపోయినట్టుగా అనిపిస్తే మీ కండ్లు మూసుకుని 2-5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.