Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. నిద్రపట్టక పోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్రపట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గ్రీన్ టీ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రశాంతమైన నిద్ర కోసం గ్రీన్ టీ తాగుతారు చాలామంది. బరువు తగ్గడానికి, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కూడా గ్రీన్ టీని తాగుతారు. గ్రీన్ టీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం, అధిక రక్తపోటు నుండి గుండె వైఫల్యం వరకు వివిధ గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. పడుకునే ముందు ఒక కప్పు తేలికపాటి, సువాసనగల గ్రీన్ టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందట.
గ్రీన్ టీలో ఎటిగల్లోకాటెచిన్ గాలెట్, ఎపిగల్లోకాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది నరాలను సడలించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తుంది.