Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ప్రారంభం నుంచి స్మార్ట్ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆన్లైన్ క్లాసులు, మీటింగ్స్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో బుకింగ్లు కూడా అధికమయ్యాయి. అయితే.. మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం వల్ల కండ్లు దెబ్బతింటాయని అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇది చర్మంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు.
స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం వల్ల కంటి నొప్పి, తలనొప్పి, వెన్ను, మెడ, కండ్ల మంటలు వస్తాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతి చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కరిష్మా కాగోడు మాట్లాడుతూ.. బ్లూ లైట్ తక్కువ వేవ్ లెంగ్త్ అని స్మార్ట్ ఫోన్, టీవీ, ట్యాబ్లెట్, ఎల్ఈడీ బల్బులో ఈ లైట్ ఉంటుందని వివరించారు.
చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ కిరణ్ లోహియా మాట్లాడుతూ.. నీలిరంగు కాంతి చర్మాన్ని ముడతలు పడేలా చేస్తుందని వివరించారు. దీంతో చర్మం త్వరగా ముసలి వారి మాదిరిగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ అయితే స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ చర్మంపై ప్రభావం చూపి వయసు ఎక్కువ అన్నట్టు మారుస్తుందని వివరిస్తున్నారు.
బ్లూ లైట్ చర్మంపై ఆరోగ్యకరమైన చర్మ కణాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడే వారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.