Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించు కోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
బౌల్లో రెండు కప్పుల పాలు, మరో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. ఈ రెండింటినీ స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ జుట్టును నీటితో తడిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి.. రెండు నెలల పాటు చేయడం వల్ల జుట్టులో తేమ పెరిగి పొడిబారకుండా, రాలిపోకుండా ఉంటుంది.
ఒక గిన్నెలో రెండు స్పూన్ల అవకాడో గుజ్జును తీసుకోవాలి. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండును గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.