Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డయాబెటిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అయితే అందుకోసం మొత్తం నోరు కట్టేసుకోనక్కర్లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు...
స్వీట్ల మోతాదు తగ్గించండి. ఒకవేళ తిన్నా చక్కెరతో చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటినే తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్. ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి పోవద్దు.
కేక్స్, కుకీస్ లాంటివి కూడా ఎక్కువ తినకూడదు. తినాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ చిన్న ముక్క. అంతే తప్ప ఒకేసారి నాలుగైదు ముక్కలు లాగించేశారో అంతే సంగతులు.
పాలు, పెరుగు వంటి వాటిలోని చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి బయట పెరుగు కొనకండి. ఇంట్లోనే ఎప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తాజాగా ఉండగానే తినేస్తే మంచిది.
ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకండి. అలాగే చాక్లెట్లు కూడా మితిమీరి తినవద్దు. అంతగా తినాలనిపిస్తే మామూలు చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ తినండి. తినగలిగితే మామూలు రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టండి.