Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా సందర్భాలలో, తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే తల్లిదండ్రులు తమ బిడ్డను తోడు లేకుండా వదిలేసినందుకు బాధ పడుతుంటారు. అయితే సరిగ్గా ప్లాన్ చేస్తే పిల్లలు ఎదగడానికి ఈ సమయం చాలా ముఖ్యం. ఒంటరిగా గడిపితే వారిలో ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెరుగుతుంది. కాబట్టి వదిలి వెళ్ళాల్సి వచ్చిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
పిల్లల దగ్గర మొబైల్ ఫోన్ ఉండేలా చూసుకోండి. ప్రతిసారీ వారితో మాట్లాడండి వాళ్లు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి.
అత్యవసర ఫోన్ నంబర్లు రెండు ఇవ్వండి అవసరమైతే కాల్ చేయవచ్చు.
ఫోన్కు వ్యసనాన్ని నివారించడానికి స్మార్ట్ఫోన్ను బదులుగా ఫీచర్ ఫోన్ ఇవ్వండి.
పిల్లలు తన తల్లిని లేదా మరొకరిని అనుకరిస్తూ తన కోసం వంట చేసుకోవాలనుకోవచ్చు. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు గ్యాస్ సిలిండర్ను ఆపడం మర్చిపోవద్దు.
ఆహారాన్ని పిల్లల చేతికి దగ్గరగా ఉంచండి. తద్వారా ఆకలిగా ఉన్నప్పుడు అనవసరంగా వెతకాల్సిన పనిలేదు.
కత్తులు, కత్తెరలు, స్క్రూడ్రైవర్లు వంటి పదునైన వస్తువులను ఎల్లప్పుడూ మీ పిల్లలకు దూరంగా ఉంచండి. ఇంటి నుండి బయలుదేరే ముందు ఇలా చేయడం మర్చిపోవద్దు.
ఎలక్ట్రానిక్ బోర్డుపై పవర్ సాకెట్ నోరు తెరిచి ఉంటే, వెంటనే వాటిని బ్లాక్ టేపుతో బిగించండి. తద్వారా పిల్లలను ప్రమాదం నుండి కాపాడుకోవచ్చు.
పిల్లల్ని ఎప్పుడూ సృజనాత్మక పనిలో బిజీగా ఉంచాలి. చదువుల మధ్య ఆటల మధ్య కూడా వారి క్రియేటివిటీని నిలబెట్టుకోవడానికి ఇష్టమైన కార్టూన్ షోను కొంత సేపు చూడనివ్వండి.