Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్‌ను ఎదర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. టీకాలతో పాటు మరింత అదనపు రక్షణ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. యాంటీ బాడీస్‌ని పెంచుకోవడం ఎలా? ఏం తింటే అవి బాగా పెరుగుతాయో తెలుసుకుందాం.
మాంసం, చికెన్, గుడ్లు, జీడిపప్పు, బాదం వంటి ప్రోటీన్ ఆహారం బాగా తినాలి. అప్పుడు వైరస్‌తో పోరాడేలా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ ఎ,సి,ఇ ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. టమాటాలు, నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ ఈ కోవలోకే వస్తాయి.
రోజూ ఓ అరగంటైనా నడిస్తే మంచిది. కనీసం 10 నిమిషాలైనా నడవాలి. శారీరక శ్రమ ఉండాలి. మెట్లు ఎక్కి దిగడం, కాస్త బరువైన వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, మొక్కలకు నీళ్లు పట్టడం వంటి పనులు చేయాలి.
ఉదయం సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. లేదా డాక్టర్ల సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోండి.
ప్రతి చిన్న దానికి అనవసరంగా టెన్షన్ పడవద్దు. యోగా చేస్తే మంచిది. ఇంట్లో పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోండి. ఇష్టమైన పని చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడితే ఒత్తిడి దూరమవుతుంది.
కాస్త రేటు ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్స్‌తో వంటలు చేసుకుంటే మేలు. వేపుళ్లు తగ్గించి, ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువ తినండి. మసాలాలు తగ్గించండి. మొలకలు తినండి. బాడీలో కొవ్వు రాకుండా జాగ్రత్తపడండి.