Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అన్ని రంగాలలో అడుగులు పెట్టారు. తమ సత్తా చాటుకుంటున్నారు. ఐటి ఒకప్పుడు పురుష ఆధిపత్యరంగం. కానీ ఇప్పుడు భారతదేశంలోని మహిళలకు అత్యంత ఎక్కువ కెరీర్ ఎంపికగా మారుతోంది. ఈ ఏడాది టెక్‌లో మహిళలు కొత్త ఎత్తుగడలతో ముందుకు వచ్చారు. అయితే నాయకత్వ స్థానాల్లో మాత్రం మహిళల సంఖ్య తక్కువగా ఉంది. మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా 2021లో ఈ రంగంలో మహిళల స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం...
ఎలక్ట్రానిక్స్ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2017-2018 ప్రకారం ఈ దశాబ్దంలో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ఎన్ఎఎస్ఎస్సిఒఎం ప్రకారం 2018లో ఇ-కామర్స్ (67.7శాతం), రిటైల్ (52శాతం)గా ఉంది. దేశంలోని అన్ని వ్యవసాయేతర రంగాలలో చూస్తే ఇది మూడవ అత్యధికంగా ఉంది. మార్చి 2020 ఎన్ఎఎస్ఎస్సిఒఎం నివేదిక ''ఇండియాస్ టెక్ ఇండిస్టీ: విమెన్ ఫర్ ది టేకేడ్'' భారతదేశ సాంకేతిక పరిశ్రమలో మహిళలు 35 శాతం ఉన్నారని చెప్పింది.
లింగ సమానత్వం సాధించాలి
టెక్ పరిశ్రమలో మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. మన యువతులు 30 శాతం మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఫ్రాన్స్ ఉన్నత విద్యపై ఆల్ ఇండియా సర్వే ప్రకారం అభివద్ధి చెందిన దేశాలైన యుఎస్, యుకె, జర్మనీ కంటే ఇది ఎక్కువ. ఈ సంఖ్యలు చూసినపుడు భారతదేశంలోని సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం అద్భుతంగా కనిపిస్తుంది. అయినప్పటికీ టెక్-ఆధారిత కంపెనీలలో కీలక నిర్ణయం తీసుకునే పాత్రలలో మహిళల ప్రాతినిధ్యం విషయానికి వస్తే లింగ సమానత్వం సాధించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం మన దగ్గర అమ్మాయిలకు వృత్తిపరంగా ఇంజనీరింగ్ మంచి పాత్ర పోషిస్తుంది. కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఈ రంగం ఎంతో తోడ్పడుతుంది. అయితే లింగ అసమానతలు, పితస్వామ్య మనస్తత్వం మన దేశాన్ని అన్ని స్థాయిలలో పట్టి పీడిస్తుంది. కార్పొరేట్ రంగాల్లో పని చేస్తున్న మహిళలు సైతం వివక్షకు అతీతం కాదు.
ఆచరణాత్మక అధ్యయనం అవసరం
స్నేహ ప్రియ... 2012లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బిఇ పట్టా పొందిన తర్వాత స్టార్టప్ ఎస్పి రోబోటిక్లో సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. రోబోట్లను తయారు చేయడం పట్ల తనకు మక్కువ ఉన్నప్పటికీ... ఇంజినీరింగ్, స్టీమ్ విద్యలో ప్రాక్టికల్ లెర్నింగ్‌ను అందించే లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ఏదీ లేదని ఆమె గ్రహించింది. ''ప్రాక్టికల్‌గా చాలా నేర్చుకోవచ్చని నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లాను. కానీ అది మరింత సైద్ధాంతికంగా ఉంది. కాబట్టి 17 ఏండ్ల వయసులో నేను అనేక ప్రయత్నాలు, విఫలాల తర్వాత నా సొంత రోబోట్లను తయారు చేశాను. వాస్తవానికి ఏదైనా పని చేసినప్పుడల్లా అది పని చేసిన సిద్ధాంతాన్ని నేను గుర్తుంచుకుంటాను. అలాగే సాంకేతికత, ఎలక్ట్రికల్ రంగంలో రాణించడానికి సైద్ధాంతిక కంటే దశ్య, ఆచరణాత్మక అభ్యాసం కలిగి ఉండటం యువకులు అవసరమని నేను నిర్ణయానికి వచ్చాను'' అని స్నేహ చెప్పారు.
సంఖ్య బాగా పెరుగుతుంది
పరిశ్రమలో దాదాపు ఒక దశాబ్దం పాటు గడిపిన ప్రాక్టికల్ లెర్నింగ్‌లో పిల్లలకు సహాయపడే ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ను నడుపుతున్న ఆమె... కోడింగ్, రోబోటిక్స్ మొదలైనవాటిని తీసుకునే అమ్మాయిల నిష్పత్తి విపరీతంగా పెరుగుతోందని ఆమె అంటున్నారు. ''ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఈ కోర్సు తీసుకోవడం చూశాం. మేము దీన్ని ప్రారంభించినప్పుడు ఒక బ్యాచ్‌లో కేవలం రెండు నుండి ఐదు శాతం మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. కానీ నేడు నెలవారీ ప్రాతిపదికన 100 శాతం వద్ధిని చూస్తున్నాము. గత నెలలో మాకు వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్‌లో 35 శాతం అమ్మాయిల నుండి వచ్చినవే'' అని ఆమె జతచేస్తున్నారు. బాలికలు చిన్న వయస్సు నుండే సాంకేతిక విద్యలో సమానంగా పాల్గొనడం ప్రారంభిస్తే తర్వాత కాలంలో అన్ని స్థాయిలలో మెరుగైన ప్రాతినిధ్యాన్ని పొందవచ్చు.
మహిళల నేతత్వంలోని సంస్థలకు నిధులు
1990 - 2010 మధ్యకాలంలో కేవలం 26 కంపెనీలు మాత్రమే ఉన్నాయని, 2014 నాటికి 75కి, 2019 నాటికి 184 స్టార్టప్‌లకు పెరగడం ద్వారా మహిళల నేతత్వంలోని టెక్ స్టార్టప్‌ల పెరుగుదలను అంచనా వేయవచ్చు. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నప్పటికీ యువర్‌స్టోరీ అనే వెబ్ పత్రిక చేసిన రీసెర్చ్ ప్రకారం మహిళల నేతత్వంలోని స్టార్టప్‌లు 2018 - 2020 మధ్య మొత్తం నిధులలో ఐదు శాతం కంటే తక్కువ పొందడం అందరినీ కలవరపెట్టే విషయం. మహమ్మారి నిధుల అసమానతను మరింత దిగజార్చింది. 2020 ప్రథమార్థంలో మహిళలు నిర్వహించే స్టార్టప్‌లలో పెట్టుబడి 24 శాతం పడిపోయిందని మేకర్స్ ఇండియా అధ్యయనంలో తేలింది.
సమానత్వానికి చేరువలో లేదు
2021లో అదితి శ్రీవాస్తవ స్థాపించిన పాకెట్ ఏసెస్ అనే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి నిధులు సమకూర్చిన కొన్ని మహిళల నేతత్వంలోని టెక్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. సోనమ్ ప్రారంభించిన ప్రెగెన్సీ యాప్‌కు సంబంధించిన సంస్థ ఐఎమ్యుఎమ్జెడ్ ను జైదీప్ మల్హోత్రా స్థాపించారు. ఓపెన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకురాలు దీనా జాకబ్, మహిళా నాయకులు, పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థల నుండి కూడా నిధుల సేకరణలో మార్పు కనిపించిందని అభిప్రాయపడ్డారు. ''ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు కూడా మహిళల నేతత్వంలోని టెక్ స్టార్టప్‌లపై గతంతో పోలిస్తే ఎక్కువ వెచ్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఎదుగుదల చాలా నెమ్మదిగా, స్థిరమైన వద్ధి ఉంది. ప్రతి నిధుల రౌండ్‌తో మేము కచ్చితంగా అభివద్ధిని చూస్తున్నాము. అయితే ఇది సమానత్వానికి చేరువలో లేదు. దానికి చాలా సమయం పడుతుంది. సమానత్వాన్ని సాధించడం కోసం సరైన దిశలో కదులుతున్నాము'' అని దీనా చెప్పారు.
దృష్టి కేంద్రీకరించాలి
సమానత్వాన్ని తీసుకురావడానికి ఇటు ప్రభుత్వం నుండి అటు పెట్టుబడిదారుల వైపు నుండి దష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రాతినిధ్యంలో స్పష్టమైన మెరుగుదలకు దారితీసే ప్రభుత్వ విధానాలకు ఉదాహరణలలో ఇజ్రాయెల్ ఒకటి. ఇజ్రాయెల్ 2019లో తన స్టార్టప్‌లలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే మహి ళల సారథ్యంలో నడుస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ శాతాన్ని పెంచ డం కోసం, మార్పు తీసుకొచ్చేందుకు నిర్దిష్ట చర్యలు చేపట్టారు. కేవలం రెండు సంవత్సరాలలోనే వారు తీసుకొచ్చిన మార్పులు మహిళా టెక్ వ్యవస్థాపకుల సంఖ్యను రెట్టింపు చేసింది. కాబట్టి మన దగ్గర కూడా టెక్‌లో ఎక్కువ మంది మహిళలను నియమించుకోవడానికి వారు మొగ్గు చూపుతున్నట్టు విస్తతంగా ప్రచారం చేసి మహిళలు నిర్వహించే మరిన్ని టెక్ స్టార్టప్‌లను కలిగి ఉండటం చాలా అవసరం.
టెక్‌లో మహిళలకు కాలం మారుతోంది
వర్క్‌ఫోర్స్‌లో మహిళలను నిలబెట్టడానికి, మహిళలు తమ వత్తిపరమైన కెరీర్లో ముఖ్యంగా ఐటీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్‌ను కలిగి ఉండటానికి అనేక సంస్థలు ఇప్పుడు డైవర్సిటీ ఈక్విటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లు, కెరీర్ రీలాంచ్ ప్రోగ్రామ్‌లను అమలు చేస్తున్నాయని దీనా ప్రస్తావించారు. ''ప్రభుత్వం అలాగే మా కంపెనీ నేతత్వంలో మేము చేస్తున్న అన్ని కార్యక్రమాలతో సాంకేతిక రంగ నాయకత్వంలో ఎక్కువ మంది మహిళలను చూడవచ్చు. స్త్రీలు ఆ స్థాయికి ఎదుగుతుంటే గత ఐదారేండ్లుగా మహిళలు అవకాశాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో స్పష్టంగా తెలుసుకుంది'' అని ఆమె జతచేస్తున్నారు.
అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు
పనిలో మహిళలను నియమించేటప్పుడు వారి మనస్తత్వ మార్పు గురించి కూడా ఆమె మాట్లాడుతూ ''ఒక దశాబ్దం కిందట మహిళలు ఎప్పుడు పెండ్లి చేసుకోబోతున్నారు, పిల్లల కోసం ప్లాన్ చేస్తారా, అప్పటికే పెండ్లయి కుటుంబం ఉంటే వారు పని చేయడానికి తగినంత సమయం ఇవ్వగలరా అని అడగడం సరైనదిగా భావించేవారు. ఈ ప్రశ్నలు నేడు కాలం చెల్లిపోయింది. ఒకవేళ ఇప్పటికీ యజమానులు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తారు'' అని ఆమె పంచుకున్నారు.
పెద్ద మార్పును చూశాను
దాదాపు రెండు దశాబ్దాలుగా టెక్ రంగంలో ఉన్న అపర్ణ సరయోగి... ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంపవర్మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించారు. టెక్ ఆధారిత స్టార్టప్‌లలో మహిళల ఆసక్తి పెరగ డాన్ని తాను చూశానని చెప్పారు. ''ఈ రోజు మహిళలు టెక్ స్టార్టప్‌లను ప్రారంభించాలనుకునేది చాలా సాధారణ మైనది. వాస్తవంగా నేను ఇందులో పెద్ద మార్పును చూశాను. ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇమ్మర్సివ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవాటిలో టెక్ కూడా వైవిధ్యభరితంగా మారింది. మహిళలు తమ స్టార్టప్‌ను వేగవంతం చేయడానికి ఈ టెక్నాలజీలన్నింటినీ ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం''అని అపర్ణ చెబుతూ తాను రూపొందించిన మహిళా పారిశ్రామికవేత్తలలో ఆమె సాధారణ ఏకాభిప్రాయాన్ని తెలిపింది. మహిళలు టెక్ ఆధారిత స్టార్టప్‌ను కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఈ రోజు ప్రపంచం వేగంగా మారిపోతుంది.
- సలీమ