Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు గతంలో మాదిరిగా 9 టు 5 ఉద్యోగాలు చేసుకుంటూ తమ నైపుణ్యాన్ని పరిమితం చేసుకోవడం లేదు. వివిధ రంగాలలో రాణించేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నారు. స్టార్టప్‌లు ప్రారంభించి సొంతంగా వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎంత పురోగతి సాధిస్తున్నా ఎక్కడో ఓ దగ్గర అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. 2021లో అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లు యునికార్న్ క్లబ్లో భాగస్వాములయ్యారు. అయితే వాటిలో కేవలం 10 శాతం మాత్రమే మహిళా వ్యవస్థాపకులచే నాయకత్వం వహించబడ్డాయి. గతంతో పోలిస్తే కాస్త మెరుగుదల ఉన్నప్పటికీ ఇందులో తీవ్ర వివక్ష కొనసాగుతుంది. ఆ వివరాలు ఏంటో ఈ రోజు మానవిలో చూద్దాం...
మనం 2021లో వెనక్కి తిరిగి చూస్తే... మన దేశం నుండి మొత్తం 42 స్టార్టప్‌లు ఈ సంవత్సరం యునికార్న్‌గా మారాయి. ఈ సంఖ్య గత పది సంవత్సరాల నుండి పరిశీలిస్తే అత్యధికం. ఇది బిలియన్-డాలర్ వాల్యుయేషన్ మార్క్‌ను దాటిన మొత్తం యాక్టివ్ స్టార్టప్‌ల సంఖ్యను 75కి తీసుకువచ్చింది. అలాగే యువర్‌స్టోరీ అనే వెబ్ పత్రిక చేసిన రీసెర్చ్ ప్రకారం వాటి విలువ 196.1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అయితే ఈ స్టార్టప్ యునికార్న్‌లలో కేవలం 10 శాతం మాత్రమే మహిళలు నాయకత్వం వహించారు.
వాస్తవం మాట్లాడుకుంటే...
ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లు యునికార్న్ లీగ్‌లో చేరినప్పటికీ వాటిలో కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. వారు ''ది గుడ్ గ్లామ్ గ్రూప్'' సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ప్రియాంక గిల్, సిఒఒ, వీశీbఱఖషఱస కు సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టకు, సిఎప్ఓ ఆప్ ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకురాలు రుచి కల్రా, ఎసికెఒ ఇన్సూరెన్స్ సహ వ్యవస్థాపకురాలు రుచి దీపక్, కో-ఫౌండర్. మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న ఈ నాలుగు స్టార్టప్‌లలో సహ వ్యవస్థాపకులుగా మగవారు కూడా ఉన్నారు. కాబట్టి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒక మహిళా వ్యవస్థాపకురాలు మాత్రమే ప్రారంభించి, నాయకత్వం వహించి యునికార్న్ లీగ్‌లోకి ప్రవేశించిన చివరి స్టార్టప్ 2020లో ఫల్గుణి నాయర్ స్థాపించిన నైకా అని చెప్పుకోవచ్చు.
మరింత లోతుగా...
అన్ని రంగాల్లో మాదిరిగానే కార్పొరేట్ రంగంలోనూ లింగ సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని పై వివరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు ప్రతిష్టాత్మకమైన బిలియన్-డాలర్ వాల్యుయేషన్ మార్ట్‌ను దాటాలంటే సమస్యను మరింత లోతుగా అట్టడుగు స్థాయి నుండి చూడాలి.
తీవ్రమైన లింగ వివక్ష
'ఇనిషియేటివ్ ఫర్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ది ఎకానమీ(ఐడబ్ల్యూడబ్ల్యూఎజిఇ) వారి 2020 నివేదిక ప్రకారం భారతదేశంలోని 100 మంది పారిశ్రామికవేత్తలలో ఏడుగురు మాత్రమే మహిళలు. వారు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించటానికి కారణం ఆకాంక్ష కంటే అవసరమే ఎక్కువ. ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్‌లో ఉన్న 77 దేశాలలో భారతదేశం 70వ స్థానంలో ఉంది. ఆరవ ఆర్థిక గణన (2013-14) భారతదేశంలో 13.76 శాతం ఎంటర్ప్రైజ్లను కలిగి ఉందని పేర్కొంది. 2019 +శీశీస్త్రశ్రీవ-దీaఱఅ తీవజూశీత్‌ీ ఈ సంఖ్య అన్ని సంస్థలలో 20 శాతానికి పెరిగింది. అయితే మహమ్మారి ఈ పురోగతికి అడ్డుకట్ట వేసింది.
ప్రతి స్థాయిలో అసమానతలు
''ఆంట్రప్రెన్యూర్ వ్యవస్థలో లింగ వివక్ష బాగా ఉందనేది గుర్తించబడిన వాస్తవం. ఇదే మీ కంపెనీని పబ్లిక్ మార్కెట్ స్థాయికి తీసుకురావడం లేదా యునికార్న్ వాల్యుయేషన్‌ను పొందడం వంటి ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి స్థాయిలో అసమతుల్యత ఉంది'' అని ప్రియాంక హెర్స్టోరీకి చెప్పారు. ''మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు ఎక్కువగా లేనప్పుడు యునికార్న్ క్లబ్లో తగినంత మంది మహిళలు చేరలేరు. మహిళా వ్యవస్థాపకులు మగవారితో పోలీస్తే ఎంత నిధులను అందుబాటులో ఉంటాయో అదే వీరిని మరింత విస్తరింపజేస్తుంది. కానీ మహిళలకు పెట్టుబడుల అందుబాటులో ఎంత వివక్ష ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఇది భారతదేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు ప్రపంచ సమస్య'' అని ఆమె యునికార్న్ క్లబ్‌లోని లింగ అసమానతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సంఖ్య రెట్టింపు అవుతుంది
మరో స్టార్టప్ వ్యవస్థాపకురాలు ఉపాసన కూడా లింగ వివక్షను ప్రస్తావిస్తున్నారు. అయితే యునికార్న్ క్లబ్లో మహిళలు 10 శాతం మార్కుకు చేరే కోణంలో పురోగతి ఉందని ఆమె అంటున్నారు. ''ఈ శాతం గొప్పది కాకపోవచ్చు. అలాగే ఎక్కడా 50-50కి దగ్గరగా ఉండదు. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. కాబట్టి అది పురోగతి. ఒక దశాబ్దం కిందట నా 29 సంవత్సరాల వయసులో స్టార్టప్ ప్రారంభించినప్పుడు యునికార్న్ క్లబ్లో స్త్రీ లేదు. దశాబ్దం కిందట ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్, మైంత్రా, స్నాప్‌డీల్, ఫ్రీచార్జ్, పేటీఎం వంటి కంపెనీల్లో ఏ ఒక్క మహిళా వ్యవస్థాపకురాలు కూడా లేదు'' అని ఆమె అన్నారు. వచ్చే దశాబ్దంలో యునికార్న్ క్లబ్లో మహిళా వ్యవస్థాపకుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఉపాసన అంచనా వేశారు.
మహిళలకు మరింత కష్టం
స్టార్టప్ వ్యవస్థాపకత గతంలో కంటే ఇప్పుడు మంచి కెరీర్ ఎంపికగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం చూస్తున్న తరాల మార్పుకు ఆమె ఈ వృద్ధిని అంకితం చేసింది. ''2015కి ముందు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో పురుషులకు కూడా ప్రవేశించడం కష్టం. కాబట్టి ఇది మహిళలకు మరింత కష్టం. నేను కొన్ని ప్రారంభ-దశ స్టార్టప్‌లను చూస్తున్నాను కాబట్టి వాటిలో చాలా వరకు వృద్ధి దశకు చేరుకుని యునికార్న్లుగా మారతాయని నేను ఆశిస్తున్నాను'' అని కూడా ఆమె అంటున్నారు.
ఎందుకు దూరమవుతున్నారు
మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటాయి. అలాగే వివిధ అడ్డంకులు, సామాజిక సమస్యల నుండి నిధుల సేకరణ వరకు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, పెట్టుబడిదారుల సంస్థలు ఎక్కువగా మగవారికే పరిమితమైన స్థావరాలు. ఏ కంపెనీ అయినా పురుషులు, మహిళలు లేదా ఇతరులు నాయకత్వం వహించినా బిలియన్ డాలర్ల మదింపులో నిధుల సేకరణ, పెట్టుబడి ముఖ్యం. కాబట్టి మహిళలు ప్రారంభించినప్పటికీ వ్యాపారాన్ని నిర్వహించడంలో నిధుల సేకరణ అత్యంత సవాలుగా మారుతుందని ఉపాసన చెప్పారు.
లింగ సమానత్వ కార్యక్రమాలతో...
నిధుల సమీకరణ సమయంలో చాలా మంది వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ హోల్డర్లు మగవారే దీనికి కారణమని ఆమె అంటున్నారు. ''ఇటీవల మేము రోడ్‌షో చేసాము. పలువురు పెట్టుబడిదారులతో మాట్లాడాము. మేము 100 మంది పెట్టుబడిదారులతో మాట్లాడి ఉండవచ్చు.. అందులో రెండు సందర్భాల్లో మాత్రమే నిర్ణయం తీసుకునే భాగస్వామి మహిళ అవుతుంది'' అని ఆమె పంచుకున్నారు. దీనికి ప్రధాన కారణం సమాజంలో నెలకొని ఉన్న లింగ వివక్ష. ''చాలా మంది పెట్టుబడిదారులు చాలా దూకుడుగా ఉంటారు. వారు ఒక వర్గాన్ని నిర్మించడంలో లేదా ఒక నిర్దిష్ట భౌగోళికంలో పెట్టుబడి పెట్టడంలో అగ్రగామిగా ఉన్న వ్యక్తిని తీసుకుంటే, ఆ కంపెనీలను నిర్మించడానికి మరొక వ్యక్తి మాత్రమే ఉండాలి'' అని ఉపాసన జతచేస్తున్నారు. స్త్రీ-కేంద్రీకృత, లింగ సమానత్వ కార్యక్రమాలు కొంతవరకు అడ్డంకులను ఛేదించడంలో సహాయపడతాయి. అయితే పురోగతి నిరాశాజనకంగా నెమ్మదిగా ఉన్నట్టు అనిపించవచ్చు.
ప్రగతిశీల నిర్ణయాలు అవసరం
ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో మహిళలు నేతృత్వంలోని కంపెనీలు యునికార్న్ క్లబ్లో చేరడంతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే మహిళా వ్యవస్థాపకులు, వ్యాపార నాయకుల చేరికను వేగవంతం చేయడానికి, కంపెనీలు, పెట్టుబడిదారుల సర్కిల్లు రెండూ ప్రగతిశీల స్పృహతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చే కలారి క్యాపిటల్ సిఎక్స్ఎక్స్ఓ బోర్డులో ఉన్న ప్రియాంక, మహిళల నేతృత్వంలోని కంపెనీల వెనుక సమానమైన మూలధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉందని వారు విశ్వసిస్తున్నారని చెప్పారు.
ఓ సంఘం అవసరం
''ఐఐటి, ఐఐఎం రంగాలలో పురుష వ్యవస్థాపకుల సంఘం ఏర్పడుతుంది. ఇలా అన్ని స్థాయిలలో అసమతుల్యత ఉన్నందున ఆ రకమైన పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ మహిళలకు అందుబాటులో ఉండదు. కాబట్టి మహిళా పారిశ్రామికవేత్తల వృద్ధికి ఓ సంఘం కీలకం. సమానమైన నిధుల సేకరణలో సహాయం అందించడం, వారి చుట్టూ ఉన్న వ్యక్తుల సమూహాన్ని చాంపియన్‌గా, మార్గదర్శకంగా, వారికి మద్దతునిచ్చేందుకు మేము మహిళా పారిశ్రామికవేత్తల శక్తివంతమైన సంఘాన్ని ఎలా సృష్టించగలము?'' అని ప్రియాంక అడుగుతున్నారు.
భాగస్వామ్యం తప్పనిసరి చేస్తే...
మరోవైపు ఉపాసన ఇన్వెస్టర్ గ్రూపుల కోర్టులో బంతిని ఉంచారు. ''గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు అన్ని స్థాయిలలో 20-25 శాతం మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తే వెంచర్ భాగస్వాములు వంటి కీలక నిర్ణయాత్మక పాత్రలు కూడా ఉంటాయి. అది పెద్ద మార్పును కలిగిస్తుంది. కానీ చాలా తక్కువ సంస్థలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అటువంటి బలమైన వైఖరిని తీసుకున్నాయి'' అని ఆమె జతచేస్తున్నారు.
మహిళల నేతృత్వంలో ఉంటే...
ఈక్వాలిటీ గ్రూప్ వారి మొదటి ఇన్‌క్లూజివ్ టాప్ 20 పిఇ, విసి ఇండెక్స్ ప్రకారం బోస్టన్ ఆధారిత బైఅవుట్ గ్రూప్ అడ్వెంట్ ఇంటర్నేషనల్, స్వీడిష్ విసి ఫైర్మ్ సంస్థ కిన్నెవిక్ అత్యంత కలుపుకొని ఉన్న సంస్థలుగా పేర్కొనబడ్డాయి. అను దుగ్గల్ స్థాపించిన ది ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్ వంటి కొన్ని మహిళల నేతృత్వంలోని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బ్లూమ్ వెంచర్స్, స్టెల్లారిస్ వెంచర్ పార్ట్నర్స్, షీ క్యాపిటల్ వంటి కీలక నిర్ణయాధికార స్థానాల్లో మహిళలు ఉన్న వెంచర్లు లింగ సమానత్వాన్ని కలిగి ఉన్నాయి.
పటిష్ట చర్యలు తీసుకోవాలి
''గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు వ్యాపార నాయకులుగా, సంస్థలను స్థాపించడంలో గణనీయమైన మార్పును చూశారు. మేము ఈ దిశలో ముందుకు సాగుతున్నప్పుడు మహిళలు నిర్వహించే కంపెనీల కోసం ఉద్దేశించిన దామాషా నిధులను ప్రోత్సహించడానికి అలాగే వారు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించడానికి మేము ఇప్పుడు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలి'' అంటున్నారు ఉపాసన.
- సలీమ