Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం కౌగిట్లో మరో ఏడాది కరిగిపోయింది. కొత్త సంవత్సరం మొదలయింది. గడిచి పోయిన సంవత్సరాన్ని నెమరు వేసుకోవడంతో పాటూ కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలా అని ప్లాన్ చేసుకోవడం సర్వసాధారణం. మీలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? అందుకోసం మీరు ఏం చేయాలి? ఏ నిర్ణయాలు తీసుకోవాలి? వాటిని ఎలా అమలు చేయాలి... అనే సందేహాలు చాలామందికి వుంటాయి. అలాంటి వారి కోసమే ఈ సూచనలు...
సెల్ఫ్ కేర్‌కి సమయం కేటాయించాలి.
కొత్త ఫ్రెండ్స్‌ని సంపాయించాలి.
ఏ రోజు ఖర్చు ఆ రోజు రాసి పెట్టుకోవాలి.
కెరీర్‌కి అవసరమయ్యే కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవాలి.
ఇంటిని డీ క్లట్టర్ చేయాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి.హ్యాపీగా జీవించాలి.
కొత్త లుక్ ఏదైనా ట్రై చేయాలి.
సోషల్ మీడియాలో స్పెండ్ చేసే టైమ్ తగ్గించాలి.
రెగ్యులర్‌గా స్నేహితులను కలుస్తూ ఉండాలి.
జీవిత భాగస్వామి ప్రేమను మిస్ అవ్వకూడదు.
టూర్స్ ప్లాన్ చేసుకోవాలి.
ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
సెకండ్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని వెతకాలి.
కల్చరల్ యాక్టివిటీస్‌లో భాగస్వాములు కావాలి.
పనులు వాయిదాలు వేయడం తగ్గించాలి.
కృతజ్ఞతా భావంతో ఉండాలి.
అవసరంలో ఉన్న వారికి వీలున్నంత సహాయం చేయాలి.
మార్పుని అంగీకరించాలి.
ముఖ్యమైన తేదీలని గుర్తు పెట్టుకోవాలి.
ఎక్కువ నీరు తాగాలి.
ప్రొడక్టివ్‌గా టైమ్ స్పెండ్ చేయాలి.
వ్యాయామం చేయాలి.
కనీసం నెలకి ఒక కొత్త పుస్తకం చదవాలి.
మొక్కలు పెంచాలి.
త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేవాలి.
సహనం పెంపొందించుకోవాలి.
ఆశావాదంతో ఉండాలి.
కుదిరినప్పుడల్లా లిఫ్ట్ వాడకం తగ్గించి మెట్లు ఎక్కాలి.
చేయలేని పని చేయలేను అని చెప్పడానికి సందేహించకూడదు.
కొత్త హాబీ నేర్చుకోవాలి.
లంచ్ టైమ్ లంచ్‌కే కేటాయించాలి, అప్పుడు పని చేయకూడదు.
ఒకసారి ఒక పనే చేయాలి.
పొద్దున్న నిద్ర లేవగానే పక్క నీట్‌గా సర్దాలి.
రోజూ పేపర్ చదవాలి, లేదా న్యూస్ చూడాలి.
రోజుకి ఒక పండైనా తినాలి.
ఇంటిని సువాసనా భరితం చేసుకోవాలి. ప