Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరుగు ఎంత రుచితో ఉంటుందో.. అది శరీరానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం, రైబోఫ్లావిన్, విటమిన్ బి6 మరియు విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
బలంగా జీర్ణశక్తి: ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రతిరోజూ పెరుగు తినాలి. పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను పెరుగు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. పెరుగులో ఉండే పోషకాహారం జీర్ణ శక్తిని పెంచుతుంది. దీని వలన మీరు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.
బలపడనున్న ఎముకలు: పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. చలికాలం కారణంగా ఎముకలకు సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటే.. పెరుగు తీసుకోవడం వల్ల చాలా మేలు చేకూరుతుంది.
చర్మానికి మేలు: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సహజ ఉత్పత్తులను ఉపయోగించటానికి ఇష్టపడతారు. రసాయన ఆధారిత ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా నిరోధించడానికి శీతాకాలంలో క్రీములు అప్లై చేస్తుంటే పెరుగు మంచి క్రీమ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మాన్ని మదువుగా మార్చడంలో సహాయపడుతుంది. శనగపిండి లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.
నడుము చుట్టూ ఉంటే కొవ్వును తగ్గిస్తుంది: పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇది చాలా ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. బాడీ బిల్డింగ్‌లో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నేటి కాలంలో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే పెరుగును మనం రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.