Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మన తరానికి కావాలో సావిత్రీ బాయి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

మన తరానికి కావాలో సావిత్రీ బాయి

Mon 03 Jan 02:31:02.237243 2022

అత్యంత ఆధునికంగా అభివద్ధి చెందామని భావిస్తున్న నేటి కాలంలోనూ ఎన్నో మూఢ విశ్వాసాలను తెలియకుండానే ఆచరిస్తున్నాం. సాంప్రదాయాల పేరిట తార్కికతను మరిచి గుడ్డిగా అనుసరించే వార్తలు చదువుతూ, చూస్తూ ఎన్నోసార్లు ఆశ్చర్యపోతున్నాం. అంతేనా? ఇప్పటికీ రెండో పౌరురాలిగానే కొనసాగుతున్న మహిళపై కాలానికి అనుగుణంగా హింస రూపాలు మార్చుకుని ప్రతిచోటా చొచ్చుకుపోతోంది. విద్యావంతులు పెరిగి, చైతన్యం ఎంతగానో పెరిగిందని చెప్పుకునే సమాజమే ఇలా ఉంటే, నూటా తొంభై ఒక్క సంవత్సరాల కిందట ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి సమాజంలో ఉదయించారు సావిత్రీబాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకా నయాగావ్‌ గ్రామం సావిత్రి జన్మస్థలం. చైతన్యాన్ని శ్వాసించి, ఆచరణలో జీవించి, తుదిశ్వాస వరకూ సంస్కరణను విడవని ఒకేఒక ధీశాలి అయిన సావిత్రి బాయి ఫూలే 1831, జనవరి మూడో తేదీన అంటే ఈరోజే ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సావిత్రి బాయి ఫూలే గురించిన విశేషాలు మీకోసం.
   సావిత్రి బాయి పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో. ఇప్పటికీ మాసిపోని బాల్య వివాహాలు ఆరోజుల్లో సర్వసాధారణం. ఆడపిల్లలు చదువుకోవడం అరుదైన విషయం. సావిత్రి బాయికీ ఏమీ తెలియని తొమ్మిదో ఏటనే (1840)వివాహం చేసేశారు ఆమె తల్లిదండ్రులు. ఆమెను వివాహమాడిన జ్యోతీరావు ఫూలే వయసు అప్పటికి 12. అక్షరం ముక్క రాని సావిత్రిని చదువువైపు ప్రోత్సహించి తొలిగురువుగా మారాడు ఫూలే. ఆ తరువాత అహ్మద్‌ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకునేదాకా పట్టుదలగా చదువు కొనసాగించారు. చురుకైన విద్యార్థిని సావిత్రి బాయికి అడుగడుగునా జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం ఎప్పుడూ వెన్నంటే ఉండేది. ఆమె చేసే ప్రతి పనికీ ఆయన సహకారం ఎనలేనిది. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే భర్త సహకారంతో 1848లో కేవలం పదిహేడేండ్ల వయసులోనే కింది కులాల బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు ఆమె. ఆ వయసుకే ఆమె కుల వివక్ష, లింగ వివక్షల పట్ల అవగాహన కలిగి ఉండడం విశేషం.
52 పాఠశాలలు స్థాపించి
   ఎవరైనా ఓ కొత్త పని ప్రారంభించారంటే చాలు ప్రోత్సహించడానికి బదులు ఎద్దేవా చేయడం లోక సహజం. సావిత్రి బాయి పాఠశాల స్థాపించి బడుగు, బలహీన వర్గాల ఆడపిల్లలను చదివించాలని పడే తపన ఆమె గ్రామస్తులకు కంటగింపుగా మారింది. రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. అయినా మొక్కవోని దీక్షతో ఆమె ముందుకే కదిలారు. ఆమెపై విసిరిన రాళ్ళు 52 పాఠశాలలకు పునాదులుగా మారాయి. ఆమెపై చల్లిన బురద దళిత బిడ్డల ఇంట విద్యా సౌగంధిక అయింది. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించడం మనం పాఠాల్లో, పత్రికల్లో చదివినంత తేలిక కాదు. పాఠశాలకు వెళ్ళే దారిలో అటకాయించే అగ్రవర్ణాల వారు ఆమెపై బురద చల్లే వారు. అంతమాత్రాన ఆమె దీక్ష ఆగిపోలేదు. తనకు తానే కొత్త మార్గాన్ని వెతుక్కున్నారు. బురద చల్లే దారిలో బురద అంటిన చీరనే ధరిస్తూ, పాఠశాలకు చేరుకున్న తరువాత సంచిలో తనతో పాటు తెచ్చుకున్న శుభ్రమైన చీర కట్టుకుని పాఠాలు చెబుతుండేవారు. ఎక్కడా ఆమె నిరాశపడలేదు. విద్యావ్యాప్తికి ఆమె చేస్తున్న కషి పెరుగుతూపోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు.
తొలి ఉపాధ్యాయురాలు
   అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించిన దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలిగా నిలిచారు సావిత్రి బాయి. 1848 మే 12న దేశంలో బహుజనుల కోసం మొట్టమ్నెదటి పాఠశాల ప్రారంభమైంది. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారు. 1848లో దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏండ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గహ బహిష్కారానికి గురిచేశారు. ఆ సమయంలో భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి స్నేహితురాలైన ఫాతిమా షేక్‌ ఇంట్లో ఆ దంపతులు ఉన్నారు. అక్కడి నుండే తమ విద్యా ఉద్యమాన్ని కొనసాగించారు.
సంఘ సంస్కర్తగా
   నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడంలో ఏనాడూ వెనుకడుగు వేయని సావిత్రి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు. మహిళల హక్కులు, సామాజిక సమస్యల పట్ల స్త్రీలలో అవగాహన పెంపొందించడం కోసం 'మహిళా సేవామండల్‌' పేరిట మహిళా సంఘాన్ని 1852లో స్థాపించారు. వితంతువులకు శిరోముండనం చేసే ఆచారం అప్పట్లో ప్రబలంగా ఉండేది. శిరోముండనం మూఢాచారమని, శిరోముండనం చేయొద్దని క్షురకులను చైతన్య పరిచి 1860లో నిలిపి వేయించారు. అంటరానితనానికి వ్యతిరేకంగానూ పోరాడారు. వితంతువులకు శిరోముండనం చేయించడమే పెద్ద సాహసమైన రోజుల్లో వితంతు వివాహాలకు నాంది పలికారు సావిత్రి బాయి. 1873లో తన భర్తతో కలిసి సత్యశోధక సమాజం ద్వారా బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సతీసహగమనం రూపుమాపడం, వితంతు పునర్వివాహం కోసం కఠినంగా శ్రమించారు. అదే ఏడాది డిసెంబర్‌ 25 న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో వివాహం జరిపించిన ధీర.
ఆచరణ కర్తగా
   చైతన్యం నిండిన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడంలో సావిత్రి బాయి ఫూలే ఏనాడూ వెనుకడుగు వేయలేదు. నలుగురికీ ఏవైతే బోధించారో వాటిని ఆచరించేందుకు తీవ్ర కషి చేశారు. ఫూలే దంపతులకు పిల్లలు కలగలేదు. కంటేనే సొంత పిల్లలు, రక్తం పంచుకు పుట్టిన పిల్లలు, మన రక్తం ప్రవహించే పిల్లలు వంటి మొనాటనీని బ్రేక్‌ చేశారు వీరిద్దరూ. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడిని దత్తత తీసుకుని సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. అతడి పేరు యశ్వంత్‌ రావు. అలాగే 1890 నవంబర్‌ 28న జ్యోతీ రావు ఫూలే మరణించారు. అంతటి దంఃఖంలోనూ సామాజిక బాధ్యతను మరవలేదామె. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటనగా చరిత్రకెక్కింది.
కవయిత్రిగా
   నిత్యం సంఘర్షణల్లో తలమునకలై ఉండే సావిత్రి బాయి కవయిత్రిగానూ రాణించారు. 1854లో ఆమె తన కవితా సంపుటి 'కావ్యఫూలే' పేరిట ప్రచురించారు. ఆ తరువాత 1891లో 'పావన కాశీసుబోధ్‌ రత్నాకర్‌' శీర్షికతో మరో కావ్యాన్ని రాశారు.
మరణం
   జీవితాన్ని బహుజనులకు అంకితం చేసిన సావిత్రి బాయి ఫూలే చివరి శ్వాస దాకా తన పంథాను వీడలేదు. ఆనాడు విస్తరించిన ప్లేగు బారిన పడ్డారు వేలాది జనం. రాత్రీ పగలూ తేడా లేకుండా వారికి సేవ చేస్తూనే గడిపారామె. అలా రోగులకు సేవ చేస్తూనే, అదే ప్లేగు బారిన పడి 1897 మార్చి 10న మరణించారు. మరణం నాటిదాకా సంస్కరణలే ఆచరిస్తూ ఉండటం సావిత్రి బాయి అకుంఠిత దీక్షకు తార్కాణం. ఆమె నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించిన ఆదర్శాలు, బోధించిన పాఠాలు, చేసిన పోరాటాలు ఈనాటికీ ఆచరించదగినవే. నేటి కాలంలో ఒక్క సావిత్రి బాయి తయారైతే ఇప్పుడున్న మహిళా తరంలో కచ్చితంగా కదలిక వస్తుందనడంలో సందేహంలేదు.
ఆమె గుర్తుగా...
   భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం 1998లో తపాలా స్టాంపును విడుదల చేసింది. అలాగే 2014, ఆగస్ట్‌ తొమ్మిదో తేదీన పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టి గౌరవించారు. అలాగే నూతన తరానికి సావిత్రి బాయి ఫూలేను పరిచయం చేస్తూనే ఉన్నారు. ఆమె గురించిన జీవిత చరిత్రపై యూట్యూబ్‌లోనూ ఎన్నో భాషల్లో సినిమాలు, వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి.
- నస్రీన్‌ఖాన్‌

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్ట్‌ ఎక్కింది
కలబందతో ఇంట్లోనే షాంపు
తొలి మహిళా పోరాట ఏవియేటర్‌
వికలాంగుల హక్కులకై పోరాడుతున్న అథ్లెట్‌
వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
ఇట్ల చేద్దాం
వీటిని తాగండి
నీళ్లు తాగండి
వెరైటీ రుచుల్లో రోటీలు
ఉద్యోగం మానేస్తున్నారా..?
కనుబొమలు చిట్లించి చూశారు
ప్రాక్టికల్‌ పరిజ్ఞానంతోనే
జుట్టు సంరక్షణకు
తినేటపుడు ఇబ్బందా..?
బరువు తగ్గేందుకు
పీరియడ్‌ లీవ్స్‌పై ఎందుకు చర్చించడం లేదు..?
మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కాలులేకపోయినా పరుగుతీసింది
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?
రోజూ కొన్ని నిమిషాలు
ఇట్ల చేద్దాం
పర్దాలో ఉంటే బాక్సింగ్‌ ఎలా ఆడగలను..?
సోలార్‌ సోదరీమణులు
ఇట్ల చేద్దాం
బరువు తగ్గించే ఆహారం
వీటిని కూడా శుభ్రం చేయండి
కొత్త రుచుల్లో ఇడ్లీ...
సువాసనలు వెదజల్లేలా...
ఇట్ల చేద్దాం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.