Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని. జుట్టు సంరక్షణ ముఖ్యంగా కష్టం. స్టోర్ నుండి ఉత్పత్తులను తీసుకురావడం, ఉపయోగించడం వల్ల జుట్టుపై దుష్ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
శీతాకాలంలో తేమ తక్కువగా ఉంటుంది, దురద ఉంటుంది. దానికి పరిష్కారం నూనె రాసుకోవడమే. ఆయిల్ మసాజ్ జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కొంతమంది జుట్టుకు ఆయిల్ పట్టించరు. రానురాను వారి హెయిర్ పొడిబారిపోతుంది.
వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ ధరించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. చుండ్రు నుండి ఉపశమనం, దురదను తగ్గిస్తుంది. అయితే ఇంట్లోనే హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. చలికాలం చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. దీనివల్ల హెయిర్ లాస్ కూడా అవుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం చేయాల్సిన పని వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటును మానేయడం. చలికాలంలో చల్లటి నీటిలో ఇలా చేయడం మంచిది కాదు. మరీ వేడినీళ్లు, చల్లనివి కాకుండా.. గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయాలి.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. దీనివల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.
వెంట్రుకలను ఆరబెట్టడానికి కాటన్ టవల్స్‌ను ఉపయోగించకుండా, మైక్రోఫైబర్ టవల్స్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. అంతేకాదు తడి జుట్టు ఉండగానే టవల్స్ కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో హెయిర్ లాస్ ఎక్కువవుతుంది.
తలస్నానం తర్వాత జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్లను ఉపయోగించవద్దు. సహజంగా పొడిగా వదిలేయండి. వేడివల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది
ఎక్కువసార్లు తలస్నానం చేసినా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వారానికి రెండుసార్లు చేస్తే తలకు సహజంగా ఉండే నూనె తగ్గుతుంది. అయితే ఆయిల్ తప్పనిసరిగా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.