Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
  • నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు సమావేశం
  • నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ
  • నల్లగొండ జిల్లాలోని ఆలయంలో విషాదం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమ్మ గుండె ఆగిపోయింది | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

అమ్మ గుండె ఆగిపోయింది

Sat 08 Jan 02:45:47.846967 2022

సింధుతారు... ఒక సామాజిక కార్యకర్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా వందలాది మంది అనాథలను అక్కున చేర్చుకున్నారు. ఆ పిల్లలను పెంచడంలో ఆమె చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది... అక్షరాల్లో రాయలేనిది. ఆమె సేవలను గుర్తించి లండన్‌ 2014లో జరిగిన నేషనల్‌ పీస్‌ సింపోజియంలో అహ్మదీయ శాంతి బహుమతిని పొందారు. అంతేకాదు ఆమె కృషికిగాను సుమారు 273 అవార్డులు అందుకున్నారు. అనాథల అమ్మగా పిల్లవబడే ఆమె రెండు రోజుల కిందట తన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కృషిని ఓసారి మననం చేసుకుందాం...
   సింధుతారు 14 నవంబర్‌ 1948న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని పింప్రి మేఘే గ్రామంలో జన్మించారు. ఇష్టంలేకుండా పుట్టిన బిడ్డ కావడంతో ఆమెకు 'చింధీ' (చిరిగిన గుడ్డ ముక్క) అని పేరు పెట్టారు. తన తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి మాత్రం సింధుతారుకి విద్యను అందించాలని అనుకున్నాడు. దుర్భరమైన పేదరికం, కుటుంబ బాధ్యతల వల్ల ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేశారు. వివాహం కావడంతో సింధుతారు 4వ తరగతి తర్వాత చదువును మానుకోవలసి వచ్చింది.
ఓ వ్యక్తిపై పోరాటం చేసి
   10 సంవత్సరాల వయసులో సింధు నవర్గావ్‌ గ్రామానికి చెందిన 30 ఏండ్ల శ్రీహరి సప్కల్‌తో వివాహం చేసుకున్నారు. భర్త ఆవుల కాపరి. ఆమెకు 20 ఏండ్లు వచ్చేసరికి ముగ్గురు కొడుకులు పుట్టారు. గ్రామస్తులకు ఏమీ చెల్లించకుండా ఎండిన ఆవు పేడను సేకరించి, అటవీ శాఖతో కుమ్మక్కై విక్రయిస్తున్నారనే నెపంతో గ్రామస్తులను మోసం చేస్తున్న ఓ స్థానిక వ్యక్తిపై ఆమె ఆందోళన చేసి విజయం సాధించారు. ఆమె ఆందోళన జిల్లా కలెక్టర్‌ను సైతం ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె పోరాటం న్యాయమైనదని గ్రహించిన కలెక్టర్‌ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉత్తర్వును జారీ చేశారు.
అన్నం కోసం అడుక్కున్నారు
   ఒక నిరుపేద మహిళ చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేని అతను ఆమెపై పగపెంచుకున్నాడు. సింధుతారు గర్భం దాల్చి 9 నెలలు దాటిన తర్వాత ఆమె భర్తను కలిసి భార్యను విడిచిపెట్టమని ఒప్పించాడు. ఆమె ఆ రాత్రి వారి ఇంటి బయట ఉన్న గోవుల ఆశ్రమంలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం తర్వాత ఆమె తనంతట తానుగా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి తన తల్లి వద్దకు వెళ్లింది. కానీ తల్లి ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో సింధుతారు కడుపునింపుకోవడం కోసం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని హిల్‌ స్టేషన్‌ చిఖల్‌ధార రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై అడుక్కోవడం ప్రారంభించారు. అలా తిరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు లేని ఎందరో పిల్లలు ఆమె కంట పడ్డారు. ఆమె వారిని తన సొంత పిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వారి ఆహారం కోసం మరింత తీవ్రంగా అడుక్కోవడం ప్రారంభించారు.
సొంత బిడ్డను ఇచ్చేశారు
   అనాథగా తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తనే తల్లి కావాలని సింధుతాయి నిర్ణయించుకున్నారు. తర్వాత ఆమె తన కూతురు, దత్తత తీసుకున్న వారి మధ్య పక్షపాత భావనను తొలగించడానికి పూణేలోని శ్రీమంత్‌ దగ్దు షేత్‌ హల్వాయి ట్రస్ట్‌కు తన కడుపున పుట్టిన బిడ్డను ఇచ్చేశారు. ఇలా సింధుతారు తన జీవితమంతా అనాథల కోసమే అంకితం చేశారు. ఫలితంగా ఆమెను అందరూ 'మాయి' (అమ్మ) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆమె దత్తత తీసుకున్న చాలా మంది పిల్లలు బాగా చదువుకుని ప్రస్తుతం న్యాయవాదులు, వైద్యులుగా ఉన్నారు. అలాగే ఆమె కన్నబిడ్డ కూడా బాగా చదువుకుని మంచ ఉద్యోగం చేస్తుంది. వీరంతా సొంతంగా అనాథాశ్రమాలను నడుపుతున్నారు.
ఆమె జీవితం బయోపిక్‌గా
   సింధూతారు వద్ద పెరిగిన పిల్లల్లో ఒకరు ఆమె జీవితంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. అంకితభావంతో అనాథల కోసం చేసిన కృషికి చిహ్నంగా ఆమె 273కి పైగా అవార్డులతో సత్కరించబడ్డారు. ఆమె తన పిల్లలకు ఇల్లు కట్టివ్వడం కోసం భూమిని కొనుగోలు చేయడానికి ఆ అవార్డు డబ్బును ఉపయోగించారు. 2010లో విడుదలైన మరాఠీ చిత్రం 'మీ సింధుతారు సప్కాల్‌' సింధుతారు నిజమైన కథ ఆధారంగా రూపొందించబడిన బయోపిక్‌. ఈ చిత్రం 54వ లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వరల్డ్‌ ప్రీమియర్‌కి ఎంపికైంది.
గుండె ఆగిపోయింది
   ఈ విధంగా 'అనాథల తల్లి'గా మారి తన జీవితకాలమంతా వారికోసమే బతికిన సింధుతారు సప్కల్‌ 73 ఏండ్ల వయసులో జనవరి 4న పూణేలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. డయాఫ్రాగ్మాటిక్‌ హెర్నియా కారణంగా గతేడాది నవంబర్‌ 24న శస్త్రచికిత్స చేయించుకున్న సింధుతారు గుండె ఆగిపోవడంతో మరణించారు. అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు పునరావాసం కల్పించడం వంటి స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు గాను ఆమెను 2021లో పద్మశ్రీతో సత్కరించారు.
ఆమె ఆకస్మిక మరణంతో...
   ఆమె మరణం తర్వాత పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్విట్‌ చేశారు. అందులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఒకరు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సింధుతారుకు నివాళులర్పించారు. ''సింధుతారు మరణవార్త దిగ్భ్రాంతికరం. ఆమె వేలాది మంది అనాథ పిల్లలకు తల్లిగా మారి వారి ఆలనా పాలనా చూసుకున్నారు. ఆమె ఆకస్మిక మరణంతో సామాజిక కార్య రంగం నుండి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం దూరం చేయబడింది'' అని ఆయన అన్నారు. ఆమె 1,500 మంది అనాథ పిల్లలను పోషించింది. 382 మంది అల్లుళ్ళు 49 మంది కోడళ్ళు ఉన్న గొప్ప కుటుంబం ఆమెది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్ట్‌ ఎక్కింది
కలబందతో ఇంట్లోనే షాంపు
తొలి మహిళా పోరాట ఏవియేటర్‌
వికలాంగుల హక్కులకై పోరాడుతున్న అథ్లెట్‌
వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
ఇట్ల చేద్దాం
వీటిని తాగండి
నీళ్లు తాగండి
వెరైటీ రుచుల్లో రోటీలు
ఉద్యోగం మానేస్తున్నారా..?
కనుబొమలు చిట్లించి చూశారు
ప్రాక్టికల్‌ పరిజ్ఞానంతోనే
జుట్టు సంరక్షణకు
తినేటపుడు ఇబ్బందా..?
బరువు తగ్గేందుకు
పీరియడ్‌ లీవ్స్‌పై ఎందుకు చర్చించడం లేదు..?
మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కాలులేకపోయినా పరుగుతీసింది
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?
రోజూ కొన్ని నిమిషాలు
ఇట్ల చేద్దాం
పర్దాలో ఉంటే బాక్సింగ్‌ ఎలా ఆడగలను..?
సోలార్‌ సోదరీమణులు
ఇట్ల చేద్దాం
బరువు తగ్గించే ఆహారం
వీటిని కూడా శుభ్రం చేయండి
కొత్త రుచుల్లో ఇడ్లీ...
సువాసనలు వెదజల్లేలా...
ఇట్ల చేద్దాం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.