Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్య ఎక్కడో ఉండదు.. మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే మందులకు ఎంత ఖర్చు చేస్తాం.. ఆ ఖర్చులో కేవలం 10శాతం ఖర్చు పెట్టినా అసలు వ్యాధే రాకుండా ఉంటుంది. ఎప్పుడూ మనకు కనపడే బత్తాయిలోనే కాదు బత్తాయి తొక్కలోనూ ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయో తెలుసా.. దీనిపై ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రత్యేక పరిశోధనలు చేసింది. క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి ఉపయోపడే ఎన్నో మెటల్ ఐయాన్స్ ఉన్నట్టు తెలిపింది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు బత్తాయిపై పరిశోధనలు చేశారు. ఇది పర్యావరణ అనుకూలమైందని, తక్కువ ఖర్చుతో యాడ్సోర్బెంట్‌ను సంశ్లేషణ చేయగలదని తెలిపారు.
బత్తాయి ఎన్నో హెక్సావాలెంట్ క్రోమియం వంటి విషపూరిత హెవీ మెటల్ అయాన్‌లను కలుషితమైన నీరు నుంచి తొలగించగలదని వీరి పరిశోధనలో వెల్లడైంది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మిశ్రా, అతని విద్యార్థి వీర్ సింగ్ ఈ పరిశోధన చేశారు. వారి పరిశోధన వివరాలను సెపరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఇప్పటికే ప్రచురించారు.