Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలను పడుకోబెట్టడం చాలా కష్టం. కొంతమంది పిల్లలకు నిద్ర పట్టదు. అర్ధరాత్రి మేల్కొంటారు. ఏడుస్తారు. పిల్లలు సులభంగా నిద్రపోయేలా చేయడం ఎలాగో? వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. .
చిన్న పిల్లల ఎదుగుదలకు నిద్ర చాలా అవసరం. వారికి కంటి నిండా నిద్ర అవసరం. 3 - 5 సంవత్సరాల వయసు పిల్లలకు 10 -13 గంటల నిద్ర అవసరం. అదే 6-12 ఏండ్ల పిల్లలకు 9 -11 గంటల నిద్ర అవసరం. 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సుఉన్న వ్యక్తులు కనీసం 7-9 గంటల నిద్ర అవసరం.
పిల్లలు త్వరగా నిద్రపోవడానికి ఇష్టపడరు. ఉదయాన్నే లేవరు. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. తరచూ ఇళ్లు మారడం, ఇంట్లో ఇబ్బందులు, పాఠశాలకు వెళ్లే తొలినాళ్లలో సమస్యలు. ఇలా అనేక కారణాల వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేరు.
పిల్లలు, పెద్దలు ఒకే సమయంలో నిద్రించడం మంచిది. ఇది నిద్ర సమయాన్ని కూడా పెంచుతుంది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం మంచిది. పిల్లలు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకాలు చదవడం వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇది బాగా నిద్ర పుచ్చడానికి సహాయపడుతుంది.
పడుకునే ముందు టీవీ చూడవద్దు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వీడియోగేమ్‌లు వంటివి ఉపయోగించవద్దు. పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు. నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉంటే నిద్ర మంచిగా పడుతుంది. పిల్లలు నిద్రవేళలో పూర్తిగా చీకటిగా ఉండకుండా రాత్రి లైట్లను ఉపయోగించాలి.
కొంతమంది పిల్లలు, పెద్దలు కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది. పారాసోమ్నియా సమస్యలో స్లీప్ వాకింగ్, స్లీప్ అప్నియా, పీడకలలతో తరచుగా మేల్కొనడం సాధారణం. ఇది పెద్దలలో కంటే పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా మంది పిల్లల్లో ఈ సమస్య వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది.