Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే లేచి హడావిడిగా ఎక్సర్ సైజ్ చేస్తాం. ఎందుంటే మనం పనికి వెళ్లడం ఆలస్యం కాకూడదు కదా.. కానీ సాయంత్రం పనులన్నీ ముగించుకుని వ్యాయామానికి వెళ్లే అవకాశం ఉంటే.. అవును వ్యాయామం చేయడానికి సరైన సమయం ఉదయం అని మనం తరచుగా వింటూ ఉంటాము. అయితే ఉదయం పూట బిజీ వల్ల వ్యాయామం, యోగా, నడక చేయలేని వారి సంగతేంటి? అటువంటి పరిస్థితిలో, సాయంత్రం వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం. నవaశ్ర్‌ీష్ట్రఱటyవీవ ప్రకారం ఇలా చేయడం వల్ల మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, మీరు వివిధ మార్గాల్లో ఒత్తిడి, మానసిక సమస్యలను కూడా తొలగించవచ్చు. ఈరోజు మనం సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వార్మప్ అవసరం లేదు: ఉదయం వ్యాయామం చేస్తే ముందుగా శరీరాన్ని వేడెక్కించుకోవాలి. మీరు వేడెక్కకుండా ఉదయం వ్యాయామం లేదా జాగ్ చేస్తే, మీ కీళ్ళు, కండరాలు లాగబడతాయి. సాయంత్రం పూట అయితే శరీరం ఇప్పటికే వెచ్చగా ఉంటుంది. దీంతో గాయం కలిగించే అవకాశం తక్కువ.
ఒత్తిడిని తగ్గించుకోండి: మీరు ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే మీ జీవనశైలిలో సాయంత్రం పూటా వ్యాయామాన్ని ప్లాన్ చేయండి. సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేయడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.
మంచి నిద్ర పొందండి: సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం సాధారణ వ్యాయామం నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. మరుసటి రోజు వ్యక్తి తాజా అనుభూతి పొందవచ్చు.
మానసిక ఆరోగ్యానికి మంచిది: ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైతే లేదా ఆందోళనతో బాధపడుతుంటే దాని నుండి ఉపశమనం పొందడానికి సాయంత్రం వ్యాయామం చేయాలి. సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం.
ఎక్కువ సమయం కేటాయించవచ్చు: ఉదయం లేవగానే కాలేజ్‌కి, ఆఫీసు టైంకి వెళ్ళడానికి వీలుగా వ్యాయామం చేయడానికి హడావుడి ఎక్కువ. కానీ మీరు అన్ని పనులను పూర్తి చేసి సాయంత్రం జిమ్‌కి వెళ్లినప్పుడు మీ కోసం మీరు ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు. దాంతో మీరు వ్యాయామాన్ని మరింత ఆస్వాదించగలుగుతారు.