Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఊహించని స్థాయిలో కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. కేవలం 24 గంటల్లోనే లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూనే మీ డైట్‌లో ఇవి ఉండేలా చూసుకుంటే.. ఒమిక్రాన్ వచ్చినా మీరు గెలిచినట్టే. కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తేనే ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూనే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సిన అవసవరం ఎంతైనా ఉంది. మాస్క్ కచ్చితంగా ధరించడం, భౌతిక దూరం పాటించడం. చేతులు శుభ్రంగా తరచూ కడుగుకోవడం లాంటి జాగ్రత్తలు పాటిస్తూనే.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం రోజువారీ డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు ఉండాలి. అవేంటో చూద్దాం...
పసువల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇది చాలా శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎలా తీసుకోవాలి అంటే.. టీస్పూన్ పసుపును తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితం ఉంటుంది.
ఈ సీజన్‌లో దొరికే ఉసిరి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. ఎలాంటి రకాల వ్యాధులను అయినా, ఇన్ఫక్షన్లను అయినా దూరం చేసే గుణం ఉసిరిలో ఉంటుంది. రోజూ నేరుగా ఉసిరికాయ తీసుకున లేదంటే మంచిది. లేదా రసం తీసుకుని అయినా తాగవచ్చు.
తేనె కూడా రోగ నిరోధక శక్తి పెంచడంలో తోడ్పడుతుంది. తేనె జీర్ణక్రియ, గట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్నది డైటీషయన్ల మాట. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఓమిక్రాన్‌తో పోరాడటానికి అల్లం టీతో పాటు ఈ తేనెను కలుపుకుంటే ఉత్తమమైన ఫలితం కనిపిస్తుంది..
రోగ నిరోధక శక్తి పెంచే పదార్ధాలలో నెయ్యి ఒకటి. ఎందుకంటే ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో సాయ పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో నెయ్యి కచ్చితంగా ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రాగులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటిలో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ కాలంలో రాగి, బజ్రా, జొన్న వంటివి తినడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి మీ జీర్ణవ్యవస్థకు మంచిది. రక్త ప్రసరణను పెంచుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కరోనాతో పాటు కొత్త వేరియంట్లు ఎన్ని వచ్చిన.. వాటిపై పోరాటం చేయడానికి మన ఆరోగ్యం సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు తమలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మెరుగైన ఫలలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..