Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి పండుగ రావడంతో రుచికరమైన పిండి వంటలతో అందరి ఇళ్లు ఘుమఘుమలాడిపోతున్నాయి. అయితే కరోనా ఉన్నందున ఈ పండగ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం...
- కరోనా విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందడి ఈ సారి కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఎక్కడ వారు అక్కడే ఉంటేనే బాగుటుందన్న కారణంతో సొంత ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గింది. ఈ కరోనా నేపథ్యంలో మీరు కూడా ఎక్కవ మందిని పండుగకు ఆహ్వానించకండి. వీలైనంత తక్కువ మందితో సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి.
- సంక్రాంతి వేడుకల సందర్భంగా మాస్క్ ధరించడం మాత్రం మరిచిపోకండి. వేరే ప్రాంతాల నుంచి చుట్టాలు వస్తే వారితో మాట్లాడేటప్పుడు ఇంట్లో అయినా సరే మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి. బయటి నుంచి వచ్చిన వారికి ఇంట్లోకి రాగానే చేతులు కడుక్కోవాలని సూచించండి.
- పండుగ అనగానే.. ముఖ్యంగా సంక్రాంతి అనగానే రుచికరమైన ఆహారం, పిండి వంటలు, పానీయాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ సంవత్సరం కరోనా ఎక్కువగా ఉన్నందున రుచితో పాటు ఆరోగ్యకరమైన ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. జంక్ ఫుడ్స్ కంటే హెల్తీ ఫుడ్ ఈ కరోనా సమయంలో చాలా ముఖ్యం.
- ఈ సంవత్సరం తక్కువ మంది వ్యక్తులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉన్నందున తక్కువ స్థలంలో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. కుండలు, డబ్బాలు, స్తంభాలను పువ్వులతో ఇంటిని అందంగా అలంకరించుకోండి.
దుస్తుల కోసం షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకోకండి. ఈ సారికి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న కొత్త బట్టలతోనే అడ్జస్ట్ అవ్వండి. షాపింగ్ కోసం జనసామర్థ్యం అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం ఈ సమయంలో రిస్క్.
కరోనా కారణంగా మీ ఆత్మీయులు రాకపోతే బాధపడకండి. టెక్నాలజీని ఉపయోగించుకుని వాట్సాప్ వీడియో కాల్స్, జూమ్ కాల్స్ ద్వారా సంబరాలు చేసుకోండి. ఆన్లైన్లోనే డ్యాన్స్ లాంటి చిన్న చిన్న కార్యక్రమాలతో మీ వారితో కలిసి ఆనందించండి. ఇలా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోండి.