Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జూన్ 3న అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
  • మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కార్మికోద్యమానికి బాటలు వేసిన మహిళ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

కార్మికోద్యమానికి బాటలు వేసిన మహిళ

Sat 15 Jan 04:20:30.364231 2022

అనసూయ సారాభారు.. అందరూ ఆమెను మోటాబెన్‌ (పెద్దక్క) అని పిలుచుకునేవారు. ఆ పిలుపును జీవితాంతం ఆమె నిలబెట్టుకోగలిగారు. ప్రముఖ భారత కార్మిక ఉద్యమ నేతల్లో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియదు. కార్మికుల పక్షాన నిలబడి సొంత కుటుంబ సభ్యులపైనే పోరాటానికి దిగిన గొప్ప నాయకురాలి. అలాంటి ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
         అనసూయ అహ్మదాబాద్‌లోని ఓ ధనిక కుటుంబంలో 1885లో జన్మించారు. చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆమె తన బాబాయి వద్దనే పెరిగారు. అప్పటి సంప్రదాయాల ప్రకారం అత్యంత చిన్న వయసులోనే అమ్మాయిలకు పెండ్లి చేసేవారు. అలా అనసూయకు కూడా 13 ఏండ్లకే పెండ్లి చేశారు. అయితే ఆ పెండ్లి ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని రోజులకే ఆమె మళ్లీ వెనక్కి వచ్చేశారు. దీంతో సోదరుడు అంబాలాల్‌ చదువుకోవాలని ఆమెను ప్రోత్సహించారు. ఉన్నత విద్య కోసం ఆమెను లండన్‌ కూడా పంపించారు. సోదరుడంటే అనసూయకు అమితమైన ప్రేమ. అయితే తన ఆకాంక్షలు భవిష్యత్‌లో తమ మధ్య చిచ్చు పెడతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు.
మహిళా హక్కుల ఉద్యమంలో...
లండన్‌లో చదువు ఆమెపై చాలా ప్రభావం చూపింది. సోషలిజంలోని ఫేబియన్‌ ఫిలాసఫీ నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. ఇంగ్లండ్‌లోని మహిళా హక్కుల ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ ఘటనలే ఆమె భవిష్యత్‌ను మార్చివేశాయి. అనసూయ జీవిత చరిత్రను ఆమె మేనకోడలు గీతా సారాభారు రాశారు. ఇంగ్లండ్‌ వీధుల్లో అనసూయ ఒంటరిగా ఎలా తిరిగేవారు, బెర్నార్డ్‌ షా, సిడ్నీ, బియట్రీస్‌ వెబ్‌ లాంటి మేధావుల ఉపదేశాలను ఎలా వినేవారు, బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ ఎలా నేర్చుకున్నారు? లాంటి అంశాలు ఈ జీవిత చరిత్రలో కనిపిస్తాయి.
భారత్‌ వచ్చిన వెంటనే
భారత్‌ వచ్చాక అనసూయ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆమె మహాత్మా గాంధీని అనుసరించారు. కుటుంబ సమస్యల కారణంగా చదువు మధ్యలోనే ఆమె భారత్‌కు రావాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే ప్రజా సేవలో ఆమె నిమగమయ్యారు. మహిళా కార్మికులు, వారి పిల్లలకు కాలికో మిల్‌ను ఇప్పించేందుకు ఆమె కషిచేశారు. అయితే ఆ మిల్లు ఆమె కుటుంబ యాజమాన్యంలో ఉండేది. మహిళలు, వారి రాజకీయ హక్కుల పేరుతో ఆమె కరపత్రాలనూ ప్రచురించారు.
నూలు పరిశ్రమ కార్మికుల కోసం...
ఒక ఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. 'ఒకరోజు ఉదయం 15 మంది కార్మికులు విస్మయానికి గురై కనిపించారు. అసలు ఏమైందని వారిని ప్రశ్నించాను. వారిలో ఒకరు మాట్లాడారు. అక్కా.. మేం ఎలాంటి విరామం లేకుండా 36 గంటలు పనిచేశాం. రెండు రోజులు, ఒక రాత్రి మొత్తం పనిచేశాం' అని వివరించారు. వారి గాథవిని అనసూయ చలించిపోయారు. నూలు పరిశ్రమ కార్మికుల కోసం ఆమె అప్పుడే పోరాటం ప్రారంభించారు. వారి దయనీయ పరిస్థితులు, పని గంటలు, పేదరికం, ఒత్తిడి, అణచివేతకు గురించి మరింత తెలుసుకున్నప్పుడు.. ఆమెలో పోరాడాలనే ఆకాంక్ష మరింత పెరిగింది. అంటే ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా తనను ఎంతగానో ప్రోత్సహించిన సోదరుడికి వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వచ్చింది.
మహమ్మారి కాలంలో...
కార్మికులకు మెరుగైన వసతులు, నిర్దిష్ట పని గంటల కోసం ఆమె పోరాటం చేశారు. 1914లో అయితే డిమాండ్ల కోసం ఆమె 21 రోజుల సమ్మె చేపట్టారు. ఆమె చేపట్టిన సమ్మెల్లో ముఖ్యమైనది 1918నాటి సమ్మె. సారాభారు కుటుంబానికి సన్నిహితుడైన మహత్మా గాంధీ ఆనాడు అనసూయకు మార్గదర్శిగా మారారు. 1917లో అహ్మదాబాద్‌లో ప్లేగు మహమ్మారి విజంభించింది. చాలామంది నగరాన్ని వదిలి గ్రామాలకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కార్మికులు వెళ్లిపోకుండా చూసేందుకు జీతాలకు అదనంగా 50 శాతం ప్లేగు బోనస్‌ ఇస్తామని మిల్లు యజమానులు ప్రకటించారు.
జీతాలు పెంచాలని
దీంతో మహమ్మారి విజంభిస్తున్నా కార్మికులు పనిచేయడం మొదలుపెట్టారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే బోనస్‌ను మిల్లు ఓనర్లు రద్దుచేశారు. అయితే అప్పటికే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. జీతాలు కోసేయడంతో కార్మికులపై ప్రభావం పడింది. దీంతో 50 శాతం జీతాలను పెంచాలంటూ అనసూయ సమ్మె చేపట్టారు. అయితే దీనికి మిల్లు యజమానులు సిద్ధంగా లేరు. లాకౌట్‌ను ప్రకటించి మిల్లులను మూసేందుకు వారు సిద్ధమయ్యారు. దీంతో కార్మికులు సమ్మె ప్రకటించారు.
యజమానులు సంఘం పెట్టుకుని
సమ్మెను ఎదుర్కొనేందుకు మిల్లు యజమానులు కూడా ఒక సంఘం ఏర్పాటుచేశారు. అనసూయ సోదరుడు అంబాలాల్‌ను తమ సంఘం అధ్యక్షుడిగా వారు ఎన్నుకున్నారు. దీంతో సోదరి కార్మిక ఉద్యమానికి నేతత్వం వహిస్తే.. సోదరుడు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించారు. తోబుట్టువులే విరోధులుగా మారిపోయారు. 16,000 మంది కార్మికులు, చేనేత కళాకారులకు అనసూయ అండగా నిలిచారు. గాంధీ మేనల్లుడు ఛగన్‌లాల్‌తో కలిసి ప్రతి రోజూ ఉదయం వారితో ఆమె మాట్లాడేవారు. ఆ సమ్మే దాదాపు నెల రోజులు నడిచింది. ప్రతిరోజూ ఉదయం ప్లకార్డులు పట్టుకొని కార్మికులు ప్రదర్శనలు చేసేవారు. మేం వెనక్కి తగ్గబోమని రోజూ వారు ప్రతినబూనేవారు. ఒక్కోసారి ఈ ప్రదర్శనలకు అనసూయ నేతత్వం వహించేవారు. కార్మికులపై విసుగుచెందే నగరవాసులు.. ఈ సమ్మెలో వారి క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయేవారు.
ఇద్దరూ వెనక్కి తగ్గలేదు
సమ్మె ప్రారంభించి రెండు వారాలు గడిచినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఒకవైపు అనసూయ, మరోవైపు అంబాలాల్‌ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. అప్పుడు పరిష్కారం చేసేందుకు గాంధీజీ వచ్చారు. ఆయన కార్మికులవైపు మొగ్గుచూపినప్పటికీ.. ఆయనంటే అంబాలాల్‌కు అమితమైన ప్రేమ ఉండేది. రోజూ మధ్యాహ్నం భోజనానికి రావాలంటూ అనసూయ, అంబాలాల్‌లను గాంధీ తన ఆశ్రమానికి ఆహ్వానించేవారు. అక్కడ అంబాలాల్‌కు అనసూయ భోజనం వడ్డించేవారు. ఇది కొంతవరకూ పరిష్కారం చూపినట్టే అనిపించింది. ఎందుకంటే ఈ ఘటనల తర్వాత మధ్యవర్తిత్వానికి ఇటు మిల్లు యజమానులు, అటు కార్మికులు ఒప్పుకున్నారు.
మరణానికి ముందు వరకు
చివరకు 35 శాతం జీతాల పెంపుకు సయోధ్య కుదిరింది. 1920లో మజ్దూర్‌ మహాజన్‌ సంఫ్‌ును అనసూయ స్థాపించారు. ఈ సంఘానికి ఆమె తొలి అధ్యక్షురాలు కూడా. 1927లో కార్మికుల ఆడపిల్లల కోసం కన్యాగV్‌ా పేరుతో ఓ పాఠశాలను కూడా ఆమె స్థాపించారు. అనసూయ యజమానుల కుటుంబంలో పుట్టి కార్మికుల కోసం పోరాడారు. 1972లో ఆమె మరణానికి ముందు రెండు లక్షల మంది కార్మికులకు ఆమె ప్రాతినిధ్యం వహించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్ట్‌ ఎక్కింది
కలబందతో ఇంట్లోనే షాంపు
తొలి మహిళా పోరాట ఏవియేటర్‌
వికలాంగుల హక్కులకై పోరాడుతున్న అథ్లెట్‌
వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
ఇట్ల చేద్దాం
వీటిని తాగండి
నీళ్లు తాగండి
వెరైటీ రుచుల్లో రోటీలు
ఉద్యోగం మానేస్తున్నారా..?
కనుబొమలు చిట్లించి చూశారు
ప్రాక్టికల్‌ పరిజ్ఞానంతోనే
జుట్టు సంరక్షణకు
తినేటపుడు ఇబ్బందా..?
బరువు తగ్గేందుకు
పీరియడ్‌ లీవ్స్‌పై ఎందుకు చర్చించడం లేదు..?
మాడిపోయిన బల్బుల్ని వెలిగిద్దాం
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కాలులేకపోయినా పరుగుతీసింది
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?
రోజూ కొన్ని నిమిషాలు
ఇట్ల చేద్దాం
పర్దాలో ఉంటే బాక్సింగ్‌ ఎలా ఆడగలను..?
సోలార్‌ సోదరీమణులు
ఇట్ల చేద్దాం
బరువు తగ్గించే ఆహారం
వీటిని కూడా శుభ్రం చేయండి
కొత్త రుచుల్లో ఇడ్లీ...
సువాసనలు వెదజల్లేలా...
ఇట్ల చేద్దాం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.