Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఇళ్లలో ఆరోగ్యాన్ని పెంచేవి చాలా ఉంటాయి. ఎక్కువగా వంటింట్లో ఉండే ఆహార పదార్థాల్లో చాలా వరకూ మనకు ఎంతో మేలు చేస్తాయి. మాటిమాటికీ మందులు వాడే కంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. తినేసోడా మనకు అద్భుతంగా పనిచేస్తుంది.
మన దంతాలు మిలమిలా మెరవాలంటే తినే సోడా పనిచేస్తుంది. చిటికెడు తినేసోడా తీసుకొని బ్రష్‌తో దంతాలపై రుద్దుకోండి. దంతాలపై ఉంటే రకరకాల గారపట్టిన రంగులన్నీ పోయి మిలమిలా మెరుస్తాయి.
సైడెర్ వెనిగర్, తినేసోడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడమే కాదు... బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కొద్ది పరిమాణంలో తీసుకోవాలి.
గుండె మంట లేదా ఏసీడీటీ సమస్య ఉంటే తినేసోడా బాగా పనిచేస్తుంది. ఇది పొట్టలో యాసిడ్లను తరిమేసి గుండె మంటను తగ్గిస్తుంది.
తినేసోడాను నోట్లో వేసుకొని నీటితో పుక్కిలించి ఊస్తే నోట్లోని వైరస్, బ్యాక్టీరియా బయటకు పోతాయి.
మీ చర్మంపై దద్దుర్లు, పొడిబారిపోవడం వంటివి ఉంటే... తినేసోడాను చర్మంపై రాసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో సన్ బాత్ చేసేవాళ్లు ఇది రాసుకొని చేసుకుంటే చర్మం కోమలం అవుతుంది.
అయితే దీన్ని వాడే వారు... డాక్టర్ సలహాలు పాటించాలి. ఎందుకంటే... అందరికీ అన్నీ సెట్ కావు. తినేసోడా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇబ్బంది కాబట్టి... దాన్ని ఎలా వాడుకోవచ్చో డాక్టర్ ద్వారా తెలుసుకోవడం మేలు.