Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, ఎలర్జీ, డీ హైడ్రేషన్ వల్ల కూడా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ కింద చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్‌తో కండ్ల కింద నెమ్మదిగా చేతి వేళ్లతో రుద్దినట్టుగా మసాజ్ చేయాలి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కండ్ల కింద మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఆలూను గుజ్జుగా చేసి లేదా ముక్కలుగా కట్ చేసి కండ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు సులభంగా తగ్గిపోతాయి.
కొబ్బరి తురుములో కొద్దిగా నిమ్మరసం, కీరదోస గుజ్జు, ఒక టీస్పూన్ క్రీమ్ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత దూదితో నెమ్మదిగా కండ్ల కింద మాస్క్‌లా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత పాలతో శుభ్రం చేసుకోవాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి.
కొబ్బరి తినడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. అంతేకాదు డార్క్ చాకొలేట్ తింటే కూడా కండ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.