Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ఎంతో మంది ఉపాధిని పోగొట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింటి. బయటకు వెళ్ళి పని చేసే అవకాశం లేకుండా చేసింది. అయితే కాస్త తెలివి వుంటే మనం చేసే రోజువారి పనుల ద్వారానే ఇంటి నుండే వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించవచ్చని ఈ కరోనా కాలంలోనే ఎంతో మంది రుజువు చేశారు. వాటిలో హోమ్ చెఫ్ ముఖ్యమైనది. ఈ కాలంలో ఎంతో మంది హోమ్ చెఫ్‌లు పుట్టుకొచ్చారు. అలాంటి వారు తయారు చేసిన నాణ్యమైన ఆహారం కష్టమర్ల వద్దకు సులభంగా చేరుకునేలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని కొన్ని ఫుడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం సృష్టించారు. అలాంటి ప్లాట్‌ఫారమ్‌లు నడుపుతూ ఇంటి చెఫ్‌లను వెలుగులోకి తెస్తూ తామూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నలుగురు మహిళా వ్యాపార వేత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం...
మహమ్మారి వల్ల బయటి ఆహారం తీసుకోవడానికి భయపడుతున్నారు. అలాంటి వారికి ఇంటి భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు ఎంతో మంది మహిళలు. భర్తలు ఉద్యోగాన్ని కోల్పోయి కుటుంబం నడపడం కష్టతరంగా మారితే మహిలళలు ఆ బాధ్యతను ఎంతో మంది తమ భుజాలకెత్తుకున్నారు. నీకేం తెలుసు వంట గదిలో గరిటె తిప్పడం తప్ప అన్న వారికి ఇప్పుడు ఆ వంటే బతికిస్తుంది. గృహిణులు తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తమకు తెలిసిన రుచికరమైన వంటకు ఆరోగ్యాన్ని జోడించి కష్టమర్ల వద్దకు వెళుతున్నారు. అలాంటి వారికి కొన్ని ఈ ప్లాట్ ఫారవమ్లు అవసరం. ఆ అవసరాన్ని తీర్చేందుకు మరికొంత మంది మహిళలు ముందుకుకొచ్చారు.
ఆన్లైన్ ఆహార సేవల ద్వారా
మన దేశంలో ఆహార సేవా మార్కెట్ 2025 నాటికి 10.3 శాతం సిఎజిఆర్ వద్ద 95.75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. సామాజిక దూరం ప్రజల ఆహారాన్ని కూడా పరిమితం చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యంతో కూడుకున్న ఆహారం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. వారి అవసరాలు తీర్చేందుకు ఇంటి వద్దనే ఉంటూ ఎంతో మంది మహిళలు హోమ్ చెఫ్‌లు అవతరించారు. పెరుగుతున్న ఆన్లైన్ ఆహార సేవలను వారు తమ ఆర్థిక వనరులుగా మార్చుకుంటున్నారు.
ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటూ...
ఈమె స్వయంగా భోజన ప్రియురాలు. ముంబైలో ఉండే సావిత్రి స్వామినాథన్ ఆరోగ్యకరమైన ఆంధ్రా ఆహారం తనకు ఎక్కడ దొరుకు తుందో తెలుసుకునేందుకు చాలా కష్టపడ్డారు. చాలా రెస్టారెంట్లు కస్టమర్లకు ఇష్టమైన వాటికి వండిపెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ముంబై వంటి కాస్మోపాలిటన్ సిటీలో అటువంటి ఆహారం అందించడం కొంత కష్టమే. అందుకే ఆమె సొంత భవనంలో తమ కుటుంబ సభ్యులకు ప్రామాణికమైన ఆంధ్రా ఆహారాన్ని అందజేయాలని భావించారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే హిందుస్థాన్ యూనిలీవర్లో తన ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపారం చేయాలనుకున్నారు. ఆమె అథెంటిక్ ఫుడ్ స్టోరీస్‌ను ప్రారంభించారు. ఇది వివిధ ప్రాంతీయ వంటకాల్లో నిపుణులైన (ఇంట్లోనే వండడానికి ఇష్టపడే) హోమ్ చెఫ్‌లను కస్టమర్లతో అనుసంధానించే ఒక టెక్ ప్లాట్‌ఫారమ్.
మార్చి 2019లో ఇది నమోదు చేయబడింది. ఇది పంజాబీ, గుజరాతీ, కాశ్మీరీ, రాజస్థానీ, మార్వాడీ, మహారాష్ట్రియన్, సింధీ, ఢిల్లీ, తూర్పు యుపి, బీహారీ, బెంగాలీ, ఒరియా, ఇండో చైనీస్, కొరియన్, జపనీస్, ఈస్ట్ ఇండియన్ వంటి 20 ప్రాంతాలకు సంబంధించిన వంటకాలను అందిస్తుంది. రూ. 20 లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమైన ఈ స్టార్టప్ ప్రతి ఏటా తన ఆదాయం రెట్టింపు చేసుకుంటుంది.
నీజీని స్థాపించి
ముంబై యూనివర్శిటీ నుండి ఎంబిఎ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అపేక్ష చాలా సంవత్సరాలుగా ఆహార, పానీయాలకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభించాలని చూస్తున్నారు. మహమ్మారి సమయం దీనికి సరైనదని భావించారు. ఈ సమయంలో హోమ్ చెఫ్‌లు ప్రాచుర్యం పొందుతున్నప్పుడు ఆమె మార్కెట్లోకి ప్రవేశింశారు. వినియోగదారు స్నేహపూర్వక వాతావరణంలో సులభంగా ఉపయోగించగల యాప్‌తో కమ్యూనిటీని నిర్మించడానికి ఇంటి చెఫ్‌లను ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడానికి ఆమె నీజీని స్థాపించారు.
ప్రారంభించిన మూడు నెలల్లోనే ఎప్ఎస్ఎస్ఎఐ ధృవీకరణ పొందే ఖర్చు మినహా కమీషన్, ఆన్‌బోర్డింగ్ రుసుము లేకుండా 25 వంటకాలకు పైగా అందిస్తూ 100 మంది చెఫ్‌లను ఈ ప్లాట్‌ఫారమ్ మీదకు సేకరించారు. మరోవైపు వినియోగదారులు వారు పని చేసే స్థలం ఆధారంగా నామమాత్రపు డెలివరీ రుసుమును వసూలు చేస్తారు. అనేక దశల నాణ్యత, రుచి తనిఖీల తర్వాత ప్రతి ఇంటి చెఫ్‌ని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకుంటారని అపేక్ష హామీ ఇస్తున్నారు. బూట్‌స్ట్రాప్ చేయబడి ఇప్పటివరకు వీరు ముంబైలో మాత్రమే పనిచేస్తున్నారు. ఆ తర్వాత నిధులను సేకరించి వ్యాపారాన్ని విసృతం చేయాలని ఆమె భావిస్తున్నారు.
గృహితుల కోసం ప్రత్యేకంగా...
గృహిణులు తమ కుటుంబం కోసం ప్రతిరోజూ కచ్చితంగా వంట చేస్తారు. మహమ్మారి ఇంటి చెఫ్‌లను వెలుగులోకి తీసుకురావడానికి చాలా కాలం ముందే రచనా రావు, ఆమె భర్త కలిసి 2016లోనే ఆహార ప్రియులు, హోమ్ చెఫ్‌లను కలుపుతూ ఫుడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించారు. గృహిణులు కనీస వనరులు, పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి సహాయపడాలనేది వీరి ఆలోచన. ఆరోగ్యకరమైన, ఇంటిలో వండిన భోజనం తీసుకోవాలని కస్టమర్ల కోరిక. వారి కోరికను తీర్చడం తమ బాధ్యతగా స్వీకరించారు. అలా స్థాపించిన ఈ స్టార్టప్ వారి సర్వీస్ కోసం 5-10 శాతం కమీషన్ వసూలు చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తుంది.
డిసెంబర్ 2018లో ప్రైమ్ వెంచర్ పార్టనర్స్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ ఫండింగ్ రౌండ్లో ఫుడ్బడ్డీ రూ. 6 కోట్లను సేకరించింది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ముందు బెంగుళూరులో ఐఐఎం గ్రాడ్యుయేట్ అయిన రచన జైనగాతో కలిసి పనిచేసింది. అలాగే ఫావమ్విల్లే 1, 2కి ప్రోడెక్ట్ హెడ్‌గా కూడా ఉంది.
పాక నైపుణ్యాల ద్వారా...
ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేసిన ఈమె మంచి వ్యాపారవేత్త. అడెటీ అగర్వాల్ 2016 నుండి స్వచ్ఛమైన ఉత్తర భారత ఆహారాన్ని బుక్ చేసుకునేందుకు ఫుడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఖీశీశీస+ఱఅఱవ ని నడుపుతున్నారు. 2020లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆమె తన రెండవ ఫుడ్‌టెక్ వెంచర్ ూఱఅసAజూతీశీఅర ని ప్రారంభించారు. కుటుంబాల్లోని ప్రాథమిక సంపాదన సభ్యులైన మగవారు కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయి ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి భార్యలు తమ పాక నైపుణ్యాల ద్వారా జీవనోపాధికి తోడ్పడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అడెటీ గుర్తించారు. ఈమె స్థాపించిన సంస్థలు పూణే నుండి 500 మంది హోమ్ చెఫ్‌లను ఆన్‌బోర్డ్ చేసింది. 20,000 మంది కస్టమర్లకు సేవ చేసింది.
ూఱఅసAజూతీశీఅర ఆ విధంగా హోమ్ చెఫ్‌లను వారి నైపుణ్యాలను ప్రదర్శించేలా ప్రోత్సహించింది. అలాగే కస్టమర్లలో ఇంట్లో వండిన, ఆరోగ్యకరమైన ఆహార సేవల గురించి అవగాహన పెంచింది. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు నిర్దిష్ట ప్రాంతీయ ఆహారం, ఇతర దేశ బేకరీ వస్తువులు, ఆరోగ్యకరమైన సలాడ్స్‌తో పాటు రోజువారీ భోజనం (టిఫిన్ చందా) అందిస్తుంది.
- సలీమ