Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాలలో ఏ బాధలు లేకుండా హ్యాపీగా సాగిపోతే సరే.. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌లు ఎక్కువగా అవుతున్నాయి. దీనివల్ల చాలామంది సింగిల్ అవుతున్నారు. దాంతో రానున్న రోజుల్లో ఎన్నో అవరోధలు ఎదురవుతాయి అనుకుంటారు. ఇది ఒక విధంగా నిజమే. ప్రతి మనిషికి తోడు అనేది చాలా అవసరం. అయితే ఆ తోడు మరీ కష్టమైతే భరించడం కూడా కష్టం. అలాంటప్పుడు సింగల్‌గా ఉండటమే మంచదంటున్నారు నిపుణులు. ఈరోజుల్లో సింగిల్‌గా ఉంటే కొన్ని మీకు తెలియని ప్రయోజనాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ప్రయాణాలు: మీరెప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు ఒకరి పర్మిషన్ అవసరం ఉండదు. వారికోసం ఎదురుచూడాల్సిన పనుండదు. మీ బ్యాగ్ ప్యాక్ సర్దేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడి సోలో ట్రిప్ ఎంజారు చేయవచ్చు.
అభివృద్ధి: ఒంటరిగా ఉండాలనుకునేవారికి ఉంటే మరో బెనిఫిట్ గ్రోత్. మీ వర్క్‌లో మీకు మీరుగా పైకి ఎదగవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులూ మీకు ఉండవు. అవధులు లేకుండా మీరు అనుకున్న లక్ష్యాలను ఒంటరిగా కూడా సాధించగలరు.
కొత్తవారితో: మీ మనసును దొచినవారు ఎవరైనా కొత్తవారుంటే, సులభంగా వారితో మింగిల్ అయిపోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకన్నాక.. వారితో మీరు మంచి బంధాన్ని ఏర్పరుచుకోవచ్చు.
సమయం: ఒంటరిగా ఉన్నవారికి మరో లాభం సమయం. వారి సమయాన్ని కేవలం వారి కోసమే కేటాయించుకోవచ్చు. దాన్ని కేవలం మీకోసమే మీకు నచ్చిన విషయాలపై కేటాయించవచ్చు.
మరింత దృఢంగా: సింగిల్‌గా ఉన్నప్పుడే మీ కాళ్ల పై మీరు నిలబడే స్వతంత్రను అలవాటు చేసుకుంటారు. అప్పుడు మీరు మరింత దృఢంగా తయారవుతారు.
సర్ధుకుపోవడం సాధారణంగా రిలేషన్ షిప్లో సర్దుకుపోవడం చాలా సాధారణం. అయితే సింగిల్‌గా ఉన్నవారికి ఈ బాధలేమీ అవసరం ఉండదు. మీకు మీరులా ఒంటరిగా ఉంటే ఒకరికి నచ్చినవిధంగానే ఉండాల్సిన పనిలేదు. ముఖ్యంగా మీరు మీరుగానే ఉండవచ్చు. అది అందరికీ ఇష్టమే కదా.. మరొకరికోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.ప