Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మగపిల్లలకు వాళ్ల పుట్టిన రోజు నాడు రోబో బొమ్మలు లేదా కన్ స్ట్రక్షన్ సెట్స్ లాంటివి బహుమతిగా ఇస్తే, ఆడపిల్లలకు మాత్రం వారి పుట్టిన రోజున కిచెన్ సెట్స్‌ను ఎందుకు బహుమానంగా ఇస్తారు. మనలో దాగి ఉన్న జెండర్ వివక్ష అనేది బాలికలను వెనుకనే ఉంచుతోందా? అగ్రగామి చర్మసంరక్షణ బ్రాండ్ గుండెను కదిలించే చిత్రంతో లింగ పక్షపాతంపై వెలుగులు ప్రసరింపచేస్తోంది. స్కూట్ ఎడ్ టెక్ అగ్రగామి లీడ్‌తో కలసి దేశ వ్యాప్తంగా బాలికలకు స్టెమ్ స్కాలర్ షిప్స్ అందజేస్తుంది.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం భారతదేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) సిబ్బందిలో మహిళలు 14శాతం మాత్రమే ఉన్నారు. అగ్రగామి చర్మసంరక్షణ బ్రాండ్ అయిన ఓలే సైన్స్ బ్రాండ్‌గా ఉంటోంది. ఆరోగ్యదాయకంగా కనిపించేలా, అందమైన చర్మంతో ఉండేలా సైన్స్ అండగా సంచలనాత్మక పదార్థాలు, ఫార్ములేషన్స్‌తో ఉత్పాదనలను అందిస్తోంది. అంతేగాకుండా ఓలే మహిళల బ్రాండ్‌గా కూడా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఓలే 220 మంది శాస్త్రవేత్తలను కలిగి ఉండగా అందులో 50శాతం మహిళలే ఉన్నారు.
స్టెమ్ కెరీర్స్‌లో మరింతగా మహిళలు ప్రపంచానికి అవసరమని ఓలే విశ్వసి స్తోంది. దేశంలో ఉన్న స్టెమ్ జెండర్ అంతరం సవిూకరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కూడా నమ్ముతోంది. సాంస్కృతికపరమైన అడ్డంకులు, జెండర్ పోషించే పాత్రపై అపోహలు లాంటివాటితో మహిళలు తరచుగా పిల్లల సంరక్షకులుగా, గృహిణులుగానే మిగిలిపోతున్నారు. మహాఅయితే టీచింగ్, నర్సింగ్, కళలు, ఇంటిని చక్కదిద్దుకోవడం లాంటి వాటికే పరిమితమైపోతున్నారు. లింగ వివక్ష, అపోహలు లాంటివి మహిళలను వెనుకవరుసలోనే ఉండేలా చేస్తున్నాయి. దేశంలో స్టెమ్ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది.
భవిష్యత్ ఉద్యోగాల్లో సరైన విధంగా పాల్గొనేందుకు వీలుగా స్టెమ్ కోర్సులను, కెరీర్స్‌ను ఎంచుకునే విధంగా భారతీయ బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓలే విశ్వసిస్తోంది.స్టెమ్ ది గ్యాప్ వంటి అర్థవంతమైన కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్టెమ్‌లో ఉన్న జెండర్ అంతరానికి ముగింపు పలికేందుకు ఓలే కట్టుబడి ఉంది. మనలో అనాలోచితంగానే ఉంటున్న ధోరణి స్టెమ్ అనేది బాలికలకు కాదు అనే విషయాన్ని ఎలా బయటకు తెస్తుందన్న అంశాన్ని బలంగా కనిపించేలా సినిమాను ఈ బ్రాండ్ తీసుకువచ్చింది.
స్టెమ్ ది గ్యాప్ కోసం మనమంతా కలసికట్టుగా పని చేసేందుకు పిలుపునిచ్చింది. అంతేగాకుండా బాలికల స్టెమ్ చదువుల కోసం అండగా నిలిచేందుకు ఈ బ్రాండ్ పలు చర్యలు తీసుకుంటోంది. స్కూట్ ఎడ్ టెక్ అగ్రగామి సంస్థ లీడ్‌తో కలసి బాలికల కోసం స్టెమ్ స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లీడ్ సంస్థ 3000కు పైగా పాఠశాల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను 12 లక్షలకు పైగా విద్యార్థులకు అందిస్తోంది. 2021 నుంచి ఓలే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ కింద బాలికలకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తోంది. ట్యాబ్‌లు, డేటా ప్యాక్‌లు కూడా అందిస్తోందని ఈ సంస్థ తెలియజేస్తుంది.