Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది. పసుపు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. చర్మం పీహెచ్ లెవెల్స్ సరైన స్థాయిలో ఉండేలా చూస్తుంది. ఈ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలంటే... ఒక బౌల్లో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గంధం, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ముఖానికి పట్టించి బాగా ఆరేంత వరకు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ముఖం కాంతిమంతం కావాలంటే కుంకుమపువ్వు ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించాలి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్, కాపర్, విటమిన్-ఎ, ఫోలిక్‌యాసిడ్, నియాసిన్ ఉంటాయి. ఈ ప్యాక్‌తో ముఖారవిందం పెరుగుతుంది. డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి. ఒక బౌల్లో రెండు టీస్పూన్ల నీళ్లు పోసి అందులో కుంకుమపువ్వు వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లలో ఒక టీస్పూన్ పాలు, కొద్దిగా పంచదార, రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఈ ఫేస్‌ప్యాక్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప