Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అలాంటి వారు జుట్టు పొడుగ్గా పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. అవేంటో ఒకసారి చూద్దాం..
బియ్యం కడిగిన నీళ్లను చాలామంది పడబోస్తుంటారు. అయితే ఆ నీళ్లలో జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఎక్కువగా ఉంటాయంట. ఆ నీళ్లల్లో అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శిరోజాలు పెరగడానికి ఎంతగానో సహకరిస్తాయి. బియ్యం నీళ్లను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు నల్లగా నిగ నిగ లాడతాయి.
ఈ నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది.
జట్టు బిరుసుగా అనిపించినప్పుడు బియ్యం కడిగిన నీళ్లను పట్టించి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.