Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత కూరగాయలను సరిగ్గా కడగడం చాలా ముఖ్యం. ఎందుకంటే కూరగాయలలో చాలా రసాయనాలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి...
మార్కెట్ నుంచి కొని తీసుకువచ్చిన కూరగాయలు కడగడానికి ముందు మీ చేతులను బాగా కడగాలి. అప్పుడు చేతిలోని బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉండదు.
కూరగాయలు, పండ్ల నుండి దుమ్మూ, ధూళిని తొలగించడానికి కూరగాయల బ్రష్‌ను ఉపయోగించండి. ఇది బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
కడిగిన తర్వాత, పండ్లు, కూరగాయలను శుభ్రమైన కాగితపు టవల్లో చుట్టండి. అప్పుడు నీరు ఆరిపోతుంది. బ్యాక్టీరియా పునరుత్పత్తి నుండి నిరోధించబడుతుంది.
కడిగిన తర్వాత పైతొక్క తొలగించి మరోసారి కూరగాయలను బాగా కడగాలి. అయితే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్లీ కడగవద్దు.
ఆకుకూరలను కూడా కట్ చేయకముందే బాగా కడగాలి. అప్పుడే వాటిలోని పోషక విలువలను కోల్పోకుండా.. ఉంటాయి.