Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో తగిన మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. యాపిల్స్‌లో శరీరంలో కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహించే కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో యాపిల్స్ చాలా మేలు చేస్తాయి. అలాగే ఇది మీ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. యాపిల్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. యాపిల్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
యాపిల్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు యాపిల్స్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ ఉదయాన్నే దీన్ని తినొచ్చు. ఆపిల్ తినడం వల్ల మెదడుపై వృద్ధాప్య ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
యాపిల్స్‌లోని ఫైబర్ మీ దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. యాపిల్ తీసుకోవడం గుండెకు చాలా మంచిది.
యాపిల్స్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణకు కూడా మేలు జరుగుతుంది.
రోజూ ఉదయాన్నే యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల ముఖంపై తెల్లమచ్చలు తగ్గుతాయి.
యాపిల్స్ ఏ సమయంలో అయినా తినొచ్చు. అయితే ఉదయం పూట యాపిల్ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
యాపిల్‌లో ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రాత్రిపూట యాపిల్ తీసుకుంటే.. అది జీర్ణక్రియలో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం దీనిని తినడానికి ఉత్తమ సమయంగా భావించవచ్చు.