Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని ఒమిక్రాన్ భయపెడుతోంది. రోజూవారి కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఇక తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ టెన్షన్ పడేలా చేస్తోంది. ఏపీలో అయితే నిత్యం.. 15 వేలకు దగ్గరగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇంతలా ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అయితే అందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. మన వంటింటి చిట్కాలతోనే ఒమిక్రాన్ దరిచేరనీయకుండా చూడొచ్చు. ఒమిక్రాన్ లాంటి వైరస్ లకు భారతీయ వంటింటి చిట్కాలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
అసలే శీతాకాలం అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలుగా చెప్పొకునే దగ్గు, జలుబు, గొంతులో గరగరలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. కొందరికి ఇవీ ఎన్ని మందులు వాడినా తగ్గవు. అయితే రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కచ్చితంగా వాటిని వెంటనే నివారించవచ్చు.
శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్లు రాకుండా శ్లేష్మం ఒక రక్షిత పాత్రను పోషిస్తుందని, కానీ కొన్నిసార్లు అది మందంగా మారుతుండడంతో సమస్య వస్తోందంటున్నారు నిపుణులు. అయితే ఇది పాల ఉత్పత్తులను తినడం.. లేదా తాగిన తరువాత ఈ కఫ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అల్లం, తేనె వాడకంతో ఈ కఫ తీవ్రతను ఈజీగా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అల్లం మొండి శ్లేష్మాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, టీ ఫంగల్ గుణాలు ఉన్నాయని వారు అంటున్నారు.
గొంతు నొప్పి, కఫంతో బాధపడుతుంటే ఉప్పు నీటితో పుక్కిలించడం చాలామంచింది అంటున్నారు. టేబుల్ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు పుక్కిలించాలి. పుక్కిలించడం వల్ల గొంతు చాలా మెరుగుపడుతంది.
ప్రతి వంటింట్లో ఉండే.. పసుపు నిజమైన ఔషదం. దీనికి నొప్పిని, మంటను తగ్గించే శక్తి ఉంది. ఒక గ్లాసు వేడి పాలలో పావు టీస్పూన్ నల్ల మిరియాలపొడి, అర టీ స్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె కలిపి.. శ్లేష్మం క్లియర్ అయ్యే వరకు ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తాగితే మంచిది.
హెర్బల్ టీ కూడా కఫాన్ని దూరం చేస్తుంది. పుదీనా, తులసి, సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, బిరియానీ ఆకు అన్నీ వేసి నీళ్లు మరగబెట్టి సగం అయిన తరువాత దించి వడకట్టాలి. తరువాత దీనికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బాగా మరిగించిన నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిని పీల్చడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ నూనె కొన్ని చుక్కలను కర్చీఫ్‌పై ఉంచి పీలిస్తే కూడా రిలీఫ్‌గా ఉంటుంది.
ఇలాంటి ఇంటి చిట్కాలను ఉపయోగించి థర్డ్ వేవ్‌లో జనాలను ఎక్కువ ఇబ్బంది పెడుతున్న ఓమిక్రాన్ వంటి కరోనా వైరస్‌లను ఇంటినుండి తరిమేయవచ్చు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో కూడా ఓమిక్రాన్ వైరస్‌తో బాధ పడేవారికి అమెరికన్ వైద్యులు మన భారతీయ ఇంటి చిట్కా వైద్యాలను వాడాలని చూచిస్తున్నారంట.