Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా మన జీవితంలో ఏదైనా మార్పు జరిగినప్పుడు దానిని సీరియస్‌గా తీసుకోము. ఆ మార్పు జరిగిన తర్వాత.. అది మనలో సానుకూలమైన ప్రభావం, లేదా ప్రతికూలమైన ప్రభావం చూపొచ్చు. మళ్లీ మనం అలాంటి పని చేయాలా వద్దా అనేది మన అనుభవం ద్వారా తెలుసుకొంటాం. ఒక పని ద్వారా ప్రతికూల విషయాలు జరుగుతాయని.. ఎదుటి వారు చెప్పినప్పటికంటే.. అనుభవంలోనే ఎక్కువగా అర్థం అవుతాయి. జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని కోసం కష్టపడాలి. ఇలాంటి విషయాలు ఎవ్వరు చెప్పిన మనకు అర్థం కావు. ఎవరికి వారే తెలుసుకోవాలి. జీవితంలో ఆలస్యంగానైనా ఎవరికి వారే తెలుసుకొనే విషయాలు ఏంటో తెలుసుకోండి.
శ్రమ: జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. ఇతరులకన్నా పది రెట్లు ఎక్కువ కష్టపడాలి. నువ్వు బాగా చదువుకోవాలంటే ఎన్నో రాత్రులు నిద్రను త్యాగం చేయాలి. ఇలా కష్టపడితేనే జీవితంలో ఎదగగలవు. మనలో చాలా మందికి ఇది చాలా ఆలస్యంగా తెలుస్తుంది.
భయం: మీరు దేనికైనా భయపడినప్పుడు మీరు దానిని మరింత ద్వేషించడం ప్రారంభిస్తారని అర్థం. దీని తర్వాత చిరాకు, కోపం, ఆగ్రహం ఉంటాయి. మీ మనసులో లోతుగా పాతుకుపోయిన భయాన్ని పోగొట్టడం ద్వారా మాత్రమే మీరు జీవితంలో పైకి రాగలరు. జీవితంలో పురోగతికి కూడా ఇది అవసరం. మనలో చాలా మంది ఈ భయాన్ని ఆలస్యంగా జయిస్తారు. మీ గెలుపు... భయాన్ని ఎంత తొందరగా జయిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
అధ్యయనం: మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్క రోజు, రెండు రోజుల అధ్యయనం మాత్రమే సరిపోదు. దీనికి దీర్ఘకాలిక కఠినమైన అభ్యాసం అవసరం. ప్రాక్టీస్ లేకుండా మనం ఏమీ చేయలేము. అలా చేస్తే అందులోని ఎన్నో అపజయాలు మనకు వస్తాయి. కాబట్టి మీలో ఉన్న ఒత్తిడిని తొలగించి, కఠినమైన వ్యాయామం చేయండి. ఇది మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. నిరంతరం మీ లక్ష్యం కోసం అవసరమైన అంశాలను బాగా అధ్యయనం చేయండి.
లైఫ్ బ్యాలెన్స్: జీవితంలో ఆలస్యంగా తెసుకొనేది ఏదైనా ఉందంటే అది లైఫ్ బ్యాలెన్స్. ఇటు జీవితాన్ని, కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది కోల్పోయినా తిరిగి రాదు. ఈ రెండు విషయాలు మీకు ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి ఎంత తొందరగా లైఫ్ బ్యాలెన్స్ నేర్చుకొంటే అంత మంచిది.
అనుభవాలు: జీవితంలో మనం చేసిన పనులు సరైనవా కావా అని తేల్చేది అనుభవాలు. ప్రతీ అనుభవం నుంచి కొత్త పాఠం నేర్చుకొండి. ప్రతీ అనుభవాన్ని పాజిటీవ్‌గా తీసుకోండి. ఇలా తీసుకోవడం అనేది అలవాటు కావడానికి ఆలస్యం అవుతుంది. మిమ్మల్ని మీరు ఉత్తమంగా చూసుకోవాలంటే అనుభవాల నుంచి నేర్చుకొనే స్కిల్ అవసరం. ఇది ఒకరు చెబితే రాదు.. ఆలస్యంగానైనా ఎవరికి వారే తెలుసుకోవాలి.