Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ ఒక్కరికి బరువు ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డాక్టర్లు వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అయితే కొన్ని పద్దతులు పాటిస్తే బరువు అదుపులో పెట్టుకోవచ్చు.
వర్కవుట్: ఒకేసారి భారీ వర్కవుట్ చేయకుండా తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేయాలి. ఎవరికి వారు వారికి సూటయ్యే వ్యాయామాన్ని ఎంచుకోవాలి.
నిద్ర: నిద్రకు మనమిచ్చే ప్రాధాన్యం తక్కువే. నిద్రను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. శరీరం రికవర్ అవడానికి, బింజ్ ఈటింగ్ను ప్రభావితం చేసే కార్టిసాల్ హార్మోన్ సక్రమ పనితీరుకు కంటి నిండా నిద్ర అవసరం. శరీరం తనకు తాను ఆరోగ్య వ్యవస్థల్లోని పొరపాట్లను సరిదిద్దుకుని, ఒత్తిడిని తగ్గించుకునే వెసులుబాటు నిద్రలోనే పొందుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు కొరత రానివ్వకూడదు.
నీరు: పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి తోడ్పడే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. దాహార్తికీ ఆకలికీ మధ్య తేడా విషయంలో శరీరం అయోమయానికి లోనవుతూ ఉంటుంది. కాబట్టి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉండాలంటే దాహం వేసే లోపే నీళ్లు తాగాలి.