Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో చాలా మంది రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. రాత్రి ఒంటి గంట తర్వాత కూడా ఫోన్లు చూస్తూ గడుపుతున్నారు. రాత్రిపూట నిద్రపోకపోతే.. కంటికి సరిపడా నిద్రలేక.. కండ్ల కింది భాగంలో నల్లటి వలయాలు ఏర్పడతాయి. డార్క్ సర్కిల్స్‌కు నిద్రలేమితో పాటు ఎన్నో ఇతర సమస్యలు కూడా కారణం. మానసి ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, ఎలర్జీ, డీ హైడ్రేషన్ వల్ల కూడా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కండ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో విటమిన్ ఏ, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు బ్లాక్ స్పాట్స్‌ను తొలగించి.. కొత్త చర్మ కణాలు ఏర్పడేందుకు దోహదపడతాయి. పాలలో కొంచెం శనగపిండి వేసి.. ఆ పేస్ట్‌ను కండ్ల కింద అప్లై చేయాలి. పూర్తిగా ఎండిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
హెర్బల్ టీ తాగడం వలన కండ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఒక పాత్రలో అల్లం, తులసి ఆకులు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం తేనె కలుపుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
గ్రీన్ టీ తాగిన తర్వాత.. టీ బ్యాగ్‌ని కండ్ల కింద ఉన్న నల్లటి వలయాలపై కాసేపు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన బ్లాక్ సర్కిల్స్ మాయమవుతాయి.
ఈ సమస్యకు కీర దోస కాయలు కూడా చక్కగా పనిచేస్తాయి. కీర దోసకాయ, నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి.. దానితో కండ్ల కింది భాగంలో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
పైనాపిల్ జూస్‌లో కాస్త పసుపు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కండ్ల కింది భాగంలో మర్దన చేయాలి. ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.