Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లాన్ని తొక్క తీసి బటర్ పేపర్‌పై ఎండలో ఆరబెట్టండి. తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిని పొట్టు తీయకుండా కడగాలి. తర్వాత నీటిని వడకట్టాలి. ఇప్పుడు దానిని కూడా ఎండలో ఆరనివ్వండి. ఆరిన తర్వాత పొట్టు తీసి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇలా అల్లం, వెల్లుల్లి పౌడర్ సిద్ధం చేసుకోండి. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి. మీకు కావలసినప్పుడు ఈ పొడిని వాడుకోవచ్చు. లేదా అవసరమైన మొత్తంలో నీరు కలిపి పేస్టులా చేసుకోవచ్చు.