Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నేండ్ల కిందట వరకు అతి తక్కువగా కనిపించిన మైక్రోవేవ్ నేడు దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. మైక్రోవేవ్ వంటను సులభంగా, వేగంగా చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్‌ను ఇంట్లో చాలా మంది వంట చేయడానికి మాత్రమే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కొన్ని రకాల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో మాత్రమే తయారు చేయవచ్చు. కానీ చాలా మందికి మైక్రోవేవ్ ఓవెన్లో అన్ని వంటకాలను ప్రయత్నించే అలవాటు ఉంటుంది. అయితే దీనిలో కొన్ని వంటకాలు ఎప్పుడూ చేయకూడదు. ఆ ఆహారాల జాబితా ఏంటో తెలుసుకుందాం...
చికెన్: మైక్రోవేవ్‌లో మీరు చికెన్ లేదా చికెన్‌తో చేసిన ఏదైనా ఆహారాన్ని ఓవర్‌హీట్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే ప్రొటీన్లు తగ్గుతాయి. అంతే కాదు రుచి కూడా తగ్గుతుంది. అందుకే వీటిని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదని నిపుపుణు అంటున్నారు.
గుడ్లు: మీరు కొన్ని నిమిషాల్లో అనేక డెజర్ట్‌లను మైక్రోవేవ్ చేయవచ్చు. చాలా మంది గుడ్లను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టడానికి ఇష్టపడతారు. కానీ మైక్రోవేవ్ ఓవెన్ ఇన్ఫ్రారెడ్ కిరణాల ఆధారంగా పని చేస్తుంది కాబట్టి, గుడ్డులో ఉండే ముఖ్యమైన పోషకాలను కోల్పోతుంది. అందుకే గుడ్డును ఎప్పుడూ మైక్రోవేవ్ ఓవెన్లో ఉడకబెట్టకూడదు.
నూనెను వేడి చేయడం: మైక్రోవేవ్‌లో గుడ్ల మాదిరిగా నూనెను ఎప్పుడూ వేడి చేయవద్దు. ఇది అన్ని రకాల నూనెలకు వర్తిస్తుంది. ఓవెన్లో నూనె వేడి చేస్తే అందులోని మంచి కొవ్వు తొలగిపోతుంది. అదేవిధంగా ఇందులోని ఉష్ణ కిరణాలు చెడు కొవ్వులను ఉత్పత్తి చేసి విషపూరితమైనవి. కాబట్టి మీరు వాడే నూనె విషపూరితం అవుతుంది.
పుట్టగొడుగులు: ఓవెన్‌ను ఉపయోగించినప్పుడు కొన్ని ఆహారాలు వాటి పోషకాలను కోల్పోతాయని కొద్ది మందికి తెలుసు. పుట్టగొడుగులు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. మైక్రోవేవ్‌లో పుట్టగొడుగులను ఎప్పుడూ ఉడికించవద్దు. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది.
అన్నం: అన్నం ఓవెన్లో వండితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. బియ్యం విషపూరితంగా మారతాయి. కాబట్టి అన్నం కూడా ఇందులో వండకూడదు. ప