Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒడిశా రాష్ట్రానికి చెందిన 14 ఏండ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉన్నతి హుడా... ఇప్పుడు ఆమె పేరు ఆ రాష్ట్రమంతా మారుమోగిపోతుంది. దానికి కారణం ఇటీవలె సూపర్ 100 టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించడమే.
ఇటీవల కటక్‌లో జరిగిన ఒడిషా ఓపెన్ 2022లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఉన్నతి సహచర భారతీయ షట్లర్ స్మిత్ తోష్నివాల్ను ఓడించి గెలిచింది. ఈ విజయంతో ఈమె దీఔఖీ సూపర్ 100 పోటీలో గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె 21 ఏండ్ల తోష్నివాల్ను 21-18, 21-11 తేడాతో ఓడించి 35 నిమిషాల్లోనే మొదటి ఒడిశా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
మూడు వరుస పాయింట్లు గెలిచి
రోV్ాతక్కు చెందిన ఈ టీనేజ్ అమ్మాయి అక్టోబర్ 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ ఫైనల్లో ఆమె మొదటి మిడ్-గేమ్ ఇంటర్మిషన్లో 11-7 తో ఓడిపోయింది. కానీ గేమ్‌ను టై చేయడానికి పుంజుకుంది. హుడా 18-18 స్కోరుతో మూడు వరుస పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను గెలుచుకుంది. మిగిలిన మ్యాచ్‌లో ప్రపంచ నం.418, ప్రపంచ నం.163 తోష్నివాల్ను అధిగమించి వరుస గేమ్‌లలో విజయాన్ని అందుకోగలిగింది.
వరుస గేమ్‌లలో ఓడించి
అంతకుముందు ఉన్నతి సెమీ-ఫైనల్లో ప్రీ-టోర్నమెంట్ ఫేవరెట్ అయిన మాళవిక బన్సోడ్ను వరుస గేమ్‌లలో ఓడించింది. ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్‌లో సైనా నెహ్వాల్‌ను ఓడించిన బన్సోద్‌పై ఆమె విజయం సాధించి, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఫైనల్లో పివి సింధు చేతిలో పడిపోవడం చాలా కీలకమైనది.
సీనియర్ ఆటగాళ్ళను ఓడించాను
ఉన్నతి రోV్‌ాతక్‌లోని డీజీవీ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈమె మీడియాతో మాట్లాడుతూ ''ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఊహించలేదు. ఇది నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఈ టోర్నమెంట్లో నా అత్యుత్తమ బ్యాడ్మింటన్ ఆడినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా అనుభవం, నైపుణ్యం ఉన్న సీనియర్ ఆటగాళ్లను ఓడించాను. ఒడిశా ఓపెన్ నాకు తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. నేను ఇక్కడ పొందిన అనుభవం అద్భుతమైనది'' అన్నది.
మరింత మెరుగ్గా ఉండాలని
సూపర్ 100 టోర్నమెంట్ విజేత ఓపెన్‌లో తన ప్రదర్శన తర్వాత తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవాలని మరింత కష్టపడుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి టాప్ 150లో భాగమయ్యేలా తన స్థానంపై మరింతగా కృషి చేయడానికి మరింత ప్రేరణ పొందింది. ఆమె ఇటీవలి విజయం తన ర్యాంకింగ్‌ను 200 నుండి 250కి పెంచడానికి సహాయపడిందని అంటుంది. అలాగే సూపర్ 500 లేదా 750 టోర్నమెంట్ల కోసం ఆడేందుకు మరింత మెరుగ్గా ఉండాలని ఆమె భావిస్తుంది. 2022 చివరి నాటికి 100-150 స్థానాల్లో తన ర్యాంకింగ్‌పై ఉండేలా కృషి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది.
కష్టమని తెలిసి...
ఉన్నతి రోV్‌ాతక్‌లోని చోటూ రామ్ స్టేడియంలో పర్వేష్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. అక్కడ ఆమె గత ఎనిమిదేండ్ల నుండి అతని మార్గదర్శకత్వంలో ప్రాక్టీస్ చేసింది. బన్సోద్తో తన మ్యాచ్ చాలా కష్టమైనదని ఆమెకు తెలుసు. అయినప్పటికి పట్టుదలతో ఆమె దానిని ఛేదించగలిగింది. అంతిమ ఫలితాలతో తనకు పెద్దగా పట్టింపు లేదని, కేవలం తన నటనలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నానని ఆమె వివరించింది.
మరో మైలు రాయిగా...
రెండు సంవత్సరాల కిందట ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో రెండవ స్థానంలో నిలిచిన తర్వాత ఉన్నతి తన ఇటీవలి విజయం భవిష్యత్తులో మరిన్ని అవార్డులను గెలుచుకునే దిశగా తన కెరీర్లో మరో మైలు రాయిగా ఉపయోగపడుతుందని భావించింది.