Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనన్య మాల్డే... పద్నాలుగేండ్ల ఈ చిన్నారి అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయడానికి రుతుక్రమం ఒక కారణమని తెలుసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గ్రహించింది. అందుకే తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గ్రామీణ ప్రజలకు యుక్తవయసు, ఆ వయసులో ప్రారంభమయ్యే రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు సిద్ధమయింది. ప్రారంభించింది. 'ప్రాజెక్ట్ ప్రగతి' పేరుతో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ అమ్మాయి గురించి మనమూ తెలుసుకుందాం...
రుతుస్రావం వెనుక సైన్స్ గురించి బాగా అనన్యకు బాగా తెలుసు. గర్భాశయం (ఎండోమెట్రియం) లైనింగ్‌ను తొలగిపోవడం వల్ల ప్రతి నెలా స్త్రీలకు రుతుస్రావం జరగడం సహజమైన శారీరక పనితీరు అని ఆమె తన జీవశాస్త్ర తరగతిలో నేర్చుకుంది. అయితే తన ఇంటి సహాయకురాలి చెల్లెలు పీరియడ్స్ కారణంగా ఏడవ తరగతి నుండి పాఠశాలకు వెళ్ళడం మానుకుందని తెలుసుకున్న ఆమె రుతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక నిషేధాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించిది.
ఇంత పెద్ద సమస్యని తెలియదు
''పీరియడ్ ప్రారంభం కావడంతో ఆమెకు ఇప్పుడు పెండ్లి వయసు వచ్చిందని వారు పెద్ద ఫంక్షన్ చేశారు. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు ఇది ఇంత పెద్ద సమస్య అని నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి సమస్యను నేను ఎప్పుడూ అనుభవించలేరు. ఈ ఆలోచన కేవలం అమ్మాయిలు పాఠశాల నుండి తప్పుకోవడానికి ఒక కారణం'' అని ఆమె అంటుంది.
సదుపాయాలు లేకపోవడం వల్ల
ఆన్లైన్లో మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత యువతుల అవకాశాలను అడ్డుకోవడంలో ఇది చాలా పెద్ద సామాజిక సమస్య అని తేలింది. దస్రా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం పాఠశాలలకు వెళ్ళి అమ్మాయిలు హాయిగా చదువుకునేందుకు అవసరమైన రుతు పరిశుభ్రత సదుపాయాలు లేకపోవడం వల్ల దాదాపు 23 మిలియన్ల మంది బాలికలు పాఠశాలను విడిచిపెట్టారు. ఇది మూఢనమ్మకాలను పారద్రోలడం, పీరియడ్ ప్రొడక్ట్‌లను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతులకు మద్దతునిచ్చే లక్ష్యంతో ప్రాజెక్ట్ ప్రగతిని ప్రారంభించేందుకు అనన్యను ప్రేరేపించింది.
మారుతున్న కాలంపై అవగాహన
బెంగుళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్ ఇందిరానగర్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అనన్య తన లక్ష్యాన్ని చేరుకునేందుకు 1వీ1దీ ఫ్యూచర్ లీడర్ ప్రోగ్రామ్‌లో చేరింది. ఇది మానవ్ సుబోధ్ సహ-స్థాపన చేసిన 1 మిలియన్ యువకులను మార్చేవారిని ప్రోత్సహించడానికి యుఎన్ గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థ. నవంబర్ 2020 నాటికి ఆమె తన సొంత రాష్ట్రం గుజరాత్‌పై దృష్టి సారించి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఎందుకంటే ప్రాంతీయ భాషపై ఆమెకున్న పట్టు గ్రామీణ జనాభాతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని ఆమె ఉద్దేశం.
టీచర్లు సిగ్గు పడుతున్నారు
1వీ1దీ ఫౌండేషన్ వారి ఎన్జీఓ భాగస్వాముల ద్వారా అనన్య మూడు గ్రామాల సర్పంచ్‌లతో కలిసి సుమారు వంద మంది పాఠశాలకు వెళ్లే బాలికలతో మారుతున్న కాలం గురించి వారి అవగాహనను అంచనా వేసింది. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులలో కూడా పీరియడ్స్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడాన్ని ఆమె గుర్తించింది. ''మహిళల్లో పీరియడ్స్ అంటే ఏమిటో, ఎందుకు వస్తాయో అనే విషయాలు తల్లిదండ్రులకు తెలియదు. తెలిసిన స్కూల్ టీచర్లు సబ్జెక్ట్‌ని వివరంగా బోధించరు. అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయని క్లాస్‌లో చెప్పే సబ్జెక్ట్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ విషయాలను బోధించడానికి, వివరించడానికి టీచర్లు సిగ్గుపడతారు'' అని అనన్య చెబుతుంది. శానిటరీ న్యాప్కిన్లు వంటి రుతుక్రమ సంరక్షణ సౌకర్యాలు లేదా వాటిని పారవేసే మార్గాలు లేకపోవడం కూడా ఒక సవాలుగా ఉంది. చుట్టుపక్కల ప్యాడ్లు అందుబాటులో లేకపోవడం లేదా వాటిని కొనుగోలు చేయలేకపోవడం వల్ల చాలా మంది దుస్తులను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
వనరుల కోసం...
క్షేత్ర పరిశోధన తర్వాత యుక్త వయసులో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించేందుకు డ్రైవ్‌లను నిర్వహించాలని, సమస్యను పరిష్కరించడానికి వనరుల గ్యాప్‌ని పూరించాలని అనన్య నిర్ణయించుకుంది. ఇంత చిన్న వయసులో ఆమె ఇంత కృషి చేస్తున్నా అవగాహన సెషన్లను నిర్వహించడానికి అనుమతి కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఒప్పించడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది.
స్థానిక భాషలోకి
మొత్తానికి ఎలాగో నచ్చజెప్పి పాఠశాలలో సెషన్లకు అనుమతి పొందింది. అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చాలా సమాచారం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉండడంతో అది అక్కడి అమ్మాయిలకు అర్థం కాదు. అందుకే ఆమె యుక్తవయసు, కౌమారదశ నుండి కాలం, స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పులను కలిగి ఉన్న సమగ్ర రుతుక్రమ ఆరోగ్య పాఠ్యాంశాలను గుజరాతీ భాషలో రూపొందించింది. అనంతరం పది నుంచి 18 ఏండ్ల లోపు బాలికలకు రుతుక్రమం వెనుక ఉన్న శాస్త్రాన్ని వివరిస్తూ అవగాహన సదస్సులు ప్రారంభించింది.
ఊహించిన దానికంటే మెరుగ్గా
''వారు పీరియడ్స్ గురించి నాతో చాలా ఓపెన్‌గా, హాయిగా మాట్లాడేవారు. వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడగలేని ప్రశ్నలు నన్ను అడిగారు. నేనూ వారి వయసే కాబట్టి సెషన్లు ఊహించిన దాని కంటే మెరుగ్గా జరిగాయి'' అని అనన్య ఆనందంగా అంటుంది. ఏప్రిల్ 2021లో ఆమె ఆన్లైన్ నిధుల సమీకరణను ప్రారంభించింది. శానిటరీ నాప్కిన్లను అందించడం, ప్యాడ్ పారవేయడం కోసం పాఠశాలల్లో ఇన్సినరేటర్లను అమర్చడం కోసం రూ. 5.5 లక్షలను సేకరించింది.
ప్యాడ్స్ అంటే తెలియనివారు
డిసెంబర్లో మళ్లీ గుజరాత్‌కు వెళ్లిన ఆమె ఈసారి రాన్ ఆఫ్ కచ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లింది. అక్కడ అక్టోబర్ నుంచి జూన్ వరకు తొమ్మిది నెలల పాటు పని చేసింది. అక్కడ ఉప్పు కార్మికులు గుడిసెలలో నివసిస్తున్నారు. ఆ పిల్లలకు తరగతి గదులుగా స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక గుడిసెలు కూడా ఏర్పాటు చేశాయి. అయితే ఇంతకు ముందు శానిటరీ ప్యాడ్స్ గురించి అక్కడి వారు పెద్దగా వినలేదు. ప్యాడ్‌ను ఎలా ధరించాలి, దాని పారవేయడం, సాధారణ రుతు పరిశుభ్రత గురించి బోధించినందున తన అవగాహన సెషన్లు వారికి ప్రత్యేకించి ప్రభావవంతంగా ఉన్నాయని అనన్య చెప్పింది.
కోవిడ్‌తో కొంత బ్రేక్
ప్పటివరకు ఆమె 30,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. కచ్, వడోదరలో ఒక్కొక్కటి చొప్పున రెండు పాఠశాలల్లో ఇన్సినరేటర్లను ఏర్పాటు చేసింది. అయితే మరింత ఫీల్డ్ వర్క్ కోసం ఆమె బెంగళూరు నుండి గుజరాత్‌కు వెళ్లలేకపోయింది. దీనికి కోవిడ్-19 పెద్ద అవరోధంగా మారింది. ఈ యువ మార్పు మేకర్ ఇప్పుడు బెంగుళూరులోని ఇంగ్లీషు మీడియం, ప్రభుత్వ పాఠశాలల జాబితాతో సిద్ధంగా ఉంది. అక్కడి వారు ఆమె నిర్వహించే అవగాహన సెషన్లకు సానుకూలంగా సహకరించాలని భావిస్తోంది. ఆమెకు కన్నడ రాదు కాబట్టి బెంగళూరులో పనిచేయడం గతంలో సవాలుగా ఉండేది. ఇప్పుడు కాస్త అలవాటు పడింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో1వీ1దీ సమ్మిట్‌లో తను ఇప్పటి వరకు చేసిన వర్క్‌ను ప్రదర్శించడానికి ఎంపికైంది.
- సలీమ