Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో సూర్యరశ్మి మనపై తక్కువగా ప్రకాశిస్తుంది కాబట్టి, శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకల పటిష్టతకు గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి ఖర్జూరం పండ్లను తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ పండులో పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయి.
ఈ పండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాల వాపును తగ్గించి, కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, అధిక రక్తపోటును నివారిస్తుంది. అలాగే దీన్ని ఉదయం, సాయంత్రం స్నాక్స్‌గా తింటే చలికాలంలో వచ్చే బద్ధకం పోతుంది.