Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూఢనమ్మకాలు, ఆచార సంప్రదాయాలు, తిరోగమన పద్ధతులు ఇప్పటికీ ప్రబలంగా ఉన్న విశాఖపట్నంలోని అరకు లోయలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఆరోగ్య సేవలను అందించడానికి నర్సు(ఎఎన్ఎం)ల బృందం ప్రతిరోజూ చాలా దూరం ట్రెక్కింగ్ చేస్తుంది. ఫలితంగా ఆ గిరిజన ప్రాంతంలో గత రెండేండ్లుగా మాతాశిశు మరణాల రేటు సున్నాకి చేరింది. ఆ లోయ ప్రాంతంలో ఆస్పత్రుల్లో ప్రసవాలు 68శాతానికి పెరిగాయి. ఈ సంఖ్య 2010లో కేవలం 18 శాతం మాత్రమే ఉన్నది. ఇంతటి అభివృద్ధి సాధించడానికి కారణమైన మిడ్వైన్ నర్సు ప్రేమ అక్కడ చేస్తున్న సేవల గురించి తెలుసుకుందాం...
గిరిజన కుటుంబాలకు మాతాశిశు ఆరోగ్యం, శిశు జననం గురించి అవగాహన కల్పించే పిరమల్ స్వాస్థ్య ఫౌండేషన్ ఏఎస్ఏఆర్ఏ వారు నిర్వహిస్తున్న ప్రాజెక్ట్‌తో కలిసి పనిచేస్తున్న 26 ఏండ్ల ప్రేమ. విశాఖపట్నానికి దాదాపు 120 కి.మీ దూరంలోని అరకులోయ మండలం లాండిగూడలో ఆమె తన సేవలు అందిస్తుంది.
తన సంఘానికి అంకితమై...
ఎరుపు రంగు సల్వార్ కమీజ్పై తెల్లటి ల్యాబ్ కోట్ ధరించి నిత్యం ఎంతో ఉత్సాహంగా ఆమె తన పనిని నిర్వర్తిస్తుంది. గిరిజన ప్రాంతంలో పని చేయడమంటే సాధారణ విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రేమ గర్భిణులకు, బాలింతలకు తన సేవలు అందిస్తుంది. స్వతహాగా గిరిజన ప్రాంతం నుండి వచ్చిన ప్రేమ తన జీవితంలో గత ఐదేండ్లుగా గిరిజన కుటుంబాలకు ప్రసవం గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేసింది. నలుగురు పిల్లలలో ఒక్కతే కూతురు. ఆమె తల్లిదండ్రులు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ కాలం గడుపుతున్నారు.
వైద్యం పట్ల శ్రద్ధ వహించాలి
ప్రేమను ఎప్పుడూ నర్సుగా ఉండాలనుకుంటున్నావా అని ఎవరైనా అడిగితే... ''నేను కనీస సౌకర్యాలు కూడా లేని గిరిజన ప్రాంతంలో పుట్టాను'' అని ఆమె చెబుతుంది. ప్రేమ 2012లో అరకులోని స్థానిక కళాశాల నుండి ఏఎన్ఎంగా పట్టభద్రురాలైంది. రెండేండ్ల పాటు సాగిన ఈ కోర్సులో ఆమెకు ఈ ప్రాంతంలోనే ఉంటూ తన సంఘం కోసం పని చేసేందుకు కావాల్సిన అర్హతలు సంపాదించింది. ''నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత వల్ల నాకు విద్య అందుబాటులోకి వచ్చింది. కొంత వరకు నేను విలాసాలు కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ అనేది చాలా శ్రద్ధ వహించాల్సిన ఒక ప్రాంతం ఇది. ఎలాంటి వైద్య సౌకర్యాలు మా వద్ద లేవు కాబట్టి నేను ఈ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. నా ముగ్గురు అన్నలు పొలాల్లో నా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి వెళతారు. నాకైతే నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ ఉద్యోగమే దొరికింది. అది కూడా మా ఇంటికి దగ్గరగా ఉంది'' అని ఆమె వివరిస్తుంది.
రవాణా చాలా కష్టం
ప్రేమ పని రోజూ ఉదయం 8.00 గంటలకు కార్యాలయంలో ప్రారంభమవుతుంది. ఇది టెలిమెడిసిన్ యూనిట్‌గా కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక్కో ఏఎన్ఎంకు రోజుకు ఒక నిర్దిష్ట తెగను కేటాయిస్తారు. ఆ రోజు ప్రేమను లాండిగూడ గ్రామంలో ఉన్న పార్ణగి పూర్జ తెగకు దిశానిర్దేశం చేశారు. ఆదిమ గిరిజన సమూహమైన ఇది 32 కుటుంబాలతో 250 జనాభాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని చాలా మంది గిరిజనులు రోడ్లు అందుబాటులో లేని కొండలపై నివసిస్తున్నారు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వైద్య మొబైల్ వాహనాలు వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయపడతాయి. కొన్ని సమయాల్లో రోగి కదలలేనప్పుడు, మోటారు రహదారికి చేరుకునే వరకు వారిని దారిలో తీసుకెళ్లడానికి స్ట్రెచర్లు ఉంటాయి.
ప్రతి ఇంటిని సందర్శించి
చాలా రోజుల వరకు ఆమె ఉద్యోగం ప్రతి ఇంటిని సందర్శించడం. మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి సర్వే నిర్వహించడం. తెగలో కాబోయే తల్లుల గురించి అడిగినప్పుడు ఆమె వారి పేర్లను ఆమె వెంటనే చెప్పింది. ఆ రోజు మొత్తం ఆరుగురు గర్భిణీ స్త్రీలు చేతులు ఎత్తారు. వారు ఎలాంటి వైద్య సేవలు అందిస్తారో మనకు తెలియజేసేందుకు ప్రేమ 28 ఏండ్ల విమలకాంతమ్మను ఎంచుకుంది.
మెడికల్ కిట్లు
సరా కార్మికులందరికీ పిరమల్ స్వాస్థ్య అందించే మెడికల్ కిట్‌లో బ్లడ్ ప్రెజర్ మానిటర్, హెల్త్ చార్ట్‌లు, డైట్ చార్ట్‌లు, ప్రెగెన్సీ కిట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు, బ్లడ్ గ్రూప్ టెస్ట్ కిట్, హైట్ అండ్ వెయిట్ చెకింగ్ మెషీన్లు, డయాబెటిస్ హైపర్‌టెన్షన్ కిట్లు వారి వద్ద సిద్ధంగా ఉంటాయి. ప్రేమ వారి రక్తపోటు, బరువు పెరుగుదలను తనిఖీ చేస్తుంది. వారి వ్యక్తిగత ఫైళ్ళలో ప్రతి స్త్రీ వివరాలను చక్కగా డాక్యుమెంట్ చేస్తుంది.
చిన్నచూపు చూస్తారు...
చాలా రోజుల తర్వాత ప్రేమ ఒక పైలట్ (మేల్ నర్సు)తో కలిసి మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు ప్రయాణించింది. ''ఫోన్ నెట్‌వర్క్‌లను మరచిపోండి. మేము గడిపే రోజులలో ఎక్కువ కాలం మా ఏకైక నెట్వర్క్ అడవి నుండి వచ్చే శబ్దం'' అంటుంది ఆమె. ''నేను సాధారణంగా యువకుడైన పైలట్‌తో కలిసి మోటర్‌బైక్‌పై ప్రయాణిస్తాను. చాలా మంది ఇలా ఒక అబ్బాయి బండి ఎక్కడాన్ని చిన్నచూపు చూస్తారు. అయితే నేను ఒక మారుమూల ప్రదేశంలో, ఒక వ్యక్తితో కలిసి డ్యూటీలో ఉన్నాను అని అర్థం చేసుకుని నా కుటుంబం నేను సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి నమ్మకంతో అనుమతిస్తుంది'' అని ప్రేమ తన పని గురించి గర్వంగా చెప్పింది.
వారి అవసరాలు అర్థం చేసుకుని
పచ్చని వరి పొలాలు, జాక్‌ఫ్రూట్ చెట్లతో నిండిన తోటల గుండా నడుస్తూ ప్రేమ తన పనిని నిబద్ధతతో చేసుకుపోతుంది. అక్కడి సమాజంలోని గర్భిణీ స్త్రీలను గుర్తించిన తర్వాత మొదటి సందర్శనలో కుటుంబం, ముఖ్యంగా భర్త గురించిన వివరాలు తెలుసుకుంటారు. తర్వాత వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి, వారికి కావల్సిన సదుపాయాలు కల్పించడానికి శిక్షణ పొందుతారు. రెండవ సందర్శనలో అయితే 28 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, మూడవది 32 వారాలకు షెడ్యూల్ చేయబడుతుంది. నాల్గవది ప్రసవానికి ముందు చెకప్ కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం.
ఒప్పించడం చాలా కష్టం
ఈ టైమ్ టేబుల్ని ఆసరా వద్ద బృందం ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి గిరిజన స్త్రీ ఆసుపత్రిని సందర్శించడం సౌకర్యంగా ఉండదు. గిరిజనులు వారి సొంత మాండలికం మాట్లాడతారు. వారందరికీ తెలుగు రాదు కాబట్టి భాషా అవరోధం కూడా ప్రతిబంధకంగా పనిచేస్తుంది. తల్లి ఆసుపత్రిలో ప్రసవించడానికి అనుమతించేలా ఆ కుటుంబాన్ని ఒప్పించడం అతి పెద్ద పని అని ఆమె చెప్పింది.
జనాభాలో లింగ వివక్ష లేదు
శిశుహత్య కేసులేవీ లేవని ప్రేమ అంటుంది. ఇది గిరిజన జనాభాలో లింగ వివక్ష ఉండదని నమ్మేలా చేస్తుంది. వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం అరకులోయలో లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 1,061 మంది స్త్రీలు. ఇది రాష్ట్ర, జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. దీని తర్వాత వీరి పనులు ఇద్దరు పిల్లల మధ్య వయసు అంతరం, రుతు పరిశుభ్రత చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. గిరిజనుల జనాభా పెరుగుదలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున దేశంలోని మిగిలిన ప్రాంతాలలో వలె కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడం అక్కడ ఉండదు.
అవగాహన పెరుగుతుంది
ప్రసవం తర్వాత 42 వారాల పాటు తల్లీ, బిడ్డ ఇద్దరూ మెడికల్ చెకప్‌లు చేయించుకునేలా బృందం అవగాహన కల్పిస్తుంది. పారిశుధ్యం, నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాల కేసులకు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజులు చాలా కష్టతరమైనవి. కానీ ఇతర వ్యాధులకు కూడా వైద్య సహాయం తీసుకోవాలనే ఆలోచన గిరిజన జనాభాలో మెల్లగా పెరుగుతుందని ప్రేమ సంతోషంగా ఉంది. ఇతర ఏఎన్ఎంలతో పాటు, ఆమె ఈ కార్యక్రమంలో చేరిన కొత్త నర్సుల బృందానికి శిక్షణ ఇస్తోంది.
ఇప్పటికీ ఆచరిస్తున్నారు
ప్రసవంలో సహాయం చేయడానికి స్థానిక దై-మా (మంత్రసాని)ని ఆహ్వానించే పురాతన ఆచారాన్ని వారు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. దీనికి తోడు మొదటి 21 రోజులు తల్లి, బిడ్డను ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకుండా లేదా వారు బయటకు వెళ్లడానికి సరైన 'ముహూర్తం' (మంచి సమయం) కోసం వేచి ఉండాలనే సంప్రదాయం కూడా తప్పక పాటిస్తారు. ఈ సమయంలో చాలా ముఖ్యమైన టీకాలు, పరీక్షలు చేయవలసి ఉంటుంది. దాంతో వారి అజ్ఞానం కారణంగా బాలితంలు, పసి పిల్లలు వాటిని కోల్పోతారు. అందుకే మా ఉద్యోగంలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైనది. తల్లీ, బిడ్డ ఇద్దరి మంచి ఆరోగ్యం కోసం సంస్థాగత ప్రసవాలకు అలవాటు పడేలా మేము మొదటి నుండి కుటుంబాలకు శిక్షణ ఇస్తున్నాము.
- ప్రేమ
- సలీమ