Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి రోజూనే ఫ్రెష్‌గా ప్రారంభించాలి అనుకుంటారు చాలామంది.. అలా ప్రారంభించడానికి అసలైన ఔషధం కాఫీ మాత్రమే.. చాలామందికి కాఫీ రుచి తగిలితే కానీ రోజు ప్రారంభమైన ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మన జీవన శైలి ప్రస్తుతం ఉరుకులు, పరుగులతో కూడుకుంది. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, ఆఫీసులో ఒత్తిడి లాంటి సమస్యలతో ప్రతి ఒక్కరు మైండ్‌కు ఫ్రెష్‌నెస్ కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికి మొదటి ఆఫ్షన్ కాఫీ. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు కుదిరితే.. ఓ కప్పు కాఫీ అంటూ ఉంటారు. అయితే లేస్తునే అన్నింటికంటే ముందు కాఫీ తారుగుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.
కాఫీ తగడం వల్ల చాలానే లాభాలు ఉండొచ్చు.. అయితే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున కాఫీ తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు ఉన్నవాళ్లంతా వెంటనే మార్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీని ఉదయాన్నే తాగడం వల్ల నిద్రలేమితోపాటు మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుందంటున్నారు. కాఫీ తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, గుండె, శ్వాస, రక్తపోటు సమస్యలతోపాటు ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు.
తెల్లావారు జామున ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆందోళన, దడపుట్టడం, ఆ తర్వాత క్రమంగా గుండెపోటుకు కూడా కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. రోజుకు ఆరు కప్పుల కాఫీ తాగితే మెదడుకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో టీ, కాఫీ తీసుకోవడం వల్ల కళ్లు తిరగడంతో పాటు వాంతులయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే లేచిన వెంటనే కాఫీని అవైడ్ చేయమని హెచ్చరిస్తున్నారు.
కాఫీని తాగడం వల్ల మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగడంతోపాటు.. జీవక్రియ, శారీరక పనితీరుపై దుష్ప్రభావం చూపుతుంది.
ఉదయాన్నే కాఫీ తాగితే.. గ్యాస్ట్రిన్ విడుదలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపులో ఉత్పత్తి చేసే హార్మోన్ వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. జీర్ణాశయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు.
రాత్రి నుండి ఏమీ తినకుండా.. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల మన పిత్తాశయం పై ప్రభావం పడుతుందట. దీని వల్ల పైత్య రసం పెరుగుతుంది. శరీరంలో పైత్య రసం పెరగడం వల్ల తల నొప్పి రావడంతో పాటు గుండెల్లో మంటగా కూడా అనిపిస్తుంది.
కాఫీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి రక్తపోటును అమాంతం పెంచుతుంది. అందుకే గుండెపోటు, బీపీ ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.