Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి సబ్బు ఉపయోగించకుండా నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా కాంతిని సంతరించుకొని, పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ మిశ్రమానికి తాజా ఫేస్ క్రీం కొద్దిగా కలిపి ముఖానికి మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మాన్ని నిగారించేలా చేయడమే కాకుండా పెదవులు కూడా పగిలిపోకుండా సంరక్షించుకోవచ్చు.
తాజా గులాబీ పూరేకలు కొద్దిగా తీసుకుని చిక్కగా ఉన్న పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అయితే ఇందుకు ఉపయోగించే గులాబీ రేకలు బాగా శుభ్రం చేసినవై ఉండాలి. అప్పుడే ఈ ప్యాక్ వల్ల సత్ఫలితాలు ఆశించవచ్చు.
రెండు చెంచాల సహజసిద్ధమైన గంధం, పావుకప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకలు తీసుకుని బాగా మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకోవడంతో పాటు యవ్వనంగా కూడా కనిపిస్తుంది.