Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రీ వీలర్ల రూపకల్పన నుండి ఎడ్టెక్ స్టార్టప్‌ను ప్రారంభించే వరకు ఎదిగింది కృతిక శ్రీనివాసన్. బివైజెయు మాజీ కార్యనిర్వాహకురాలైన ఈమె 2019లో కెరీర్ల్యాబ్లను ప్రారంభించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్లేస్మెంట్లను పొందేందుకు సహాయం చేసారు. టివి మోటార్స్ కోసం త్రీ వీలర్ ఆటోలను డిజైన్ చేయడం నుండి యువత తమ కెరీర్‌ను మరింత మెరుగ్గా నడిపించడంలో తన కెరీర్ ఎలా సాగిందో మనమూ తెలుసుకుందాం...
కృతికా శ్రీనివాసన్ అడ్మిషన్ కన్సల్టింగ్ సేవలను స్థాపించిన బివైజెయుతో కలిసి ఐదేండ్లు విజయవంతంగా పని చేశారు. తర్వాత 2019లో పిఎన్ సంతోష్, ప్రసన్న అళగేశన్లతో కలిసి కెరీర్లాబ్ను స్థాపించారు. కోయంబత్తూరులోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి 2003లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బంగారు పతకాన్ని అందుకున్న ఇంజనీర్ ఈమె. తర్వాత కొంతకాలం టివి మోటార్స్ కోసం త్రీ వీలర్ల రూపకల్పనలో తన వృత్తిని ప్రారంభించింది. ఆటో బోల్ఓవర్లను పరీక్షించే బృందంలో ఆమె ఒక్కతే మహిళా ఇంజనీర్
విదేశాల్లో చదువుకోసం
త్రీ వీలర్ల రూపకల్పనలో మూడేండ్లు పనిచేసిన తర్వాత 2006లో కృతిక విదేశాల్లో చదువుకోవాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోని టాప్ త్రీ యూనివర్శిటీల్లో ఒకటైన మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ చదవడానికి దరఖాస్తు చేసుకుంది. ''విదేశాల్లోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసే ప్రక్రియ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నా దరఖాస్తును గడువుకు 10 రోజుల ముందు మాత్రమే పంపాను. అవి స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపే రోజులు. కోర్సుకు కావల్సిన నిధులు సమకూర్చుకోవడం కూడా కష్టంగా మారింది. మా నాన్న నా కోసం అధిక వడ్డీలకు రుణం తీసుకోవలసి వచ్చింది. అయితే యూనివర్సిటీలో ఉన్న నా సీనియర్లు నాకెంతో సహకరించారు'' అని కృతిక గుర్తుచేసుకుంది.
అక్కడ నేర్చుకున్న విషయాలే
తన మాస్టర్స్ సమయంలో కృతికకు రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి మార్కెటింగ్‌ను అభ్యసించే అవకాశం లభించింది. ఇప్పుడు చేస్తున్న పనిలో చాలా వరకు అక్కడ నేర్చుకున్న విషయాలే ఎంతో ఉపయోగపడుతున్నాయి. యుఎస్‌లో చదువుతున్న ఐదేండ్లలో ఆమె 18-వీలర్లు, స్మార్ట్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులలో పనిచేసింది.
కెరీర్ల్యాబ్లను ప్రారంభించడం
''నేను వారి కోసం ఏర్పాటు చేసిన బివైజెయు కోసం అడ్మిషన్స్ కన్సల్టింగ్‌లో అవకాశం పొందిన ఇంజనీర్ని. 6,000 మంది విద్యార్థులతో కలిసి పనిచేశాను. వారికి విదేశాల్లో చదువుకోవడానికి సహాయం చేశాను. మేము ఈ విద్యార్థులతో కలిసి పని చేస్తున్నప్పుడు చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లరని మేము గ్రహించాము. ఎందుకంటే అక్కడికి వెళితే వారు తమ వృత్తిని కూడా ప్రారంభించవలసి ఉంటుంది. ఆ సమయానికి మేము దాదాపు 150 కళాశాలలు, శిక్షణ, ప్లేస్మెంట్ అధికారులతో అనుసంధానించబడ్డాము. కాబట్టి ఉన్నత విద్యా రంగంలో బాగా చేయగలిగాము. విదేశాలలో అధ్యయనాలను చాలా ఉన్నతంగా, నైతిక పద్ధతిలో స్కేల్ చేయగలిగాము'' అని కృతిక చెబుతుంది.
విదేశాల్లో పెరుగుతున్న అవకాశాలు
ఉన్నత విద్య నుండి వారు ఎంఎన్‌సిలలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్ వైపు వెళ్లారు. బివైజెయు 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులతో కలిసి పని చేస్తుంది. దాంతో వారు కెరీర్ల్యాబ్లను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విదేశాలలో పెరుగుతున్న ఉన్నత విద్యావకాశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో వృత్తిని కోరుకునే యువత ఎక్కువగా ఉండటంతో కెరీర్ కౌన్సెలింగ్, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ కూడా పెరిగింది.
ప్రొఫైల్ బిల్డర్
2021లో జరిగిన ఐసి3 ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ క్వెస్ట్ సర్వే ప్రకారం 71 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తు ఉపాధి గురించి విమర్శనాత్మకంగా ఆలోచిస్తున్నారు. అందుకే గత దశాబ్దం నుండి ఎడ్టెక్ స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. కృతిక ప్రకారం కెరీర్ల్యాబ్లను వేరు చేసేది ఏమిటంటే వారు విదేశాలలో చదువుకోవడానికి విద్యార్థులకు సహాయం చేస్తున్నప్పుడు విదేశాలలో చదువుకోవాలనే వారి లక్ష్యానికి అనుకూలమైన ప్రొఫైల్ ప్రతి ఒక్కరికీ ఉండదని వారు గ్రహించారు. కాబట్టి వారు ఔత్సాహికుల ప్రొఫైల్‌లను రూపొందించడానికి ప్రొఫైల్ బిల్డర్ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
ఇంజనీరింగ్ విద్యార్థులపై దృష్టి
ప్రస్తుతం ఇది ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులు, చిన్న పట్టణాల్లోని కళాశాలల నుండి చదివి ప్లేస్‌మెంట్స్‌తో ఇబ్బంది పడుతున్న గ్రాడ్యుయేట్లను అందిస్తుంది. ''ప్రధానంగా మేము ఇంజినీరింగ్ విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించాము. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఊహకు అందని ఉద్యోగాన్ని ఎలా పొందుతారు అనే సమస్యను పరిష్కరించడం ద్వారా ఈ ఆలోచన ప్రారంభమైంది. యువత నేర్చుకోవడానికి, బాగా సంపాదించడానికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము''అని కృతిక జత చేస్తుంది.
మహిళల భాగస్వామ్యం
కేవలం రెండు సంవత్సరాలలో బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న కెరీర్ల్యాబ్స్ పూణే, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలలో కూడా తన కార్యాలయాలను ప్రారంభించింది. స్టార్టప్ రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు చేరువయ్యిందని, 2023 చివరి నాటికి రూ. కోటి రూపాయల వార్షిక రికరింగ్ రెవెన్యూని తాకుతుందని అంచనా వేస్తున్నట్లు కృతిక అంటుంది. కోర్సుల్లో మహిళల భాగస్వామ్యం 25 నుంచి 40 శాతం మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. ''వాస్తవానికి, కొన్ని కోర్సులలో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం (కంపెనీ అవసరాల ఆధారంగా) ఇవ్వబడుతుంది'' అని ఆమె చెప్పింది.
మహిళల సంఖ్య తగ్గుతుంది
ప్రధాన నాయకత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో కెరీర్ల్యాబ్స్ ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో వ్యవహరిస్తుండటంతో ఈ ప్రోగ్రామ్‌ల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకుంటున్నారని కృతిక చెప్పారు. అనుభవం ఉన్న వ్యక్తులు బి-స్కూల్స్‌లో చేరేందుకు కూడా వారు సహాయం చేస్తారు. ''మాకు ఐదారు సంవత్సరాల అనుభవం ఉన్న వినియోగదారులు ఉన్నారు. ఇందులో మహిళా దరఖాస్తుదారుల సంఖ్య తగ్గుతుంది'' అని కృతికా చెబుతుంది.
ముందున్న సవాళ్లు, ప్రణాళికలు
బివైజెయు వంటి బ్రాండ్ కోసం పని చేయడం వలన కృతిక నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహాయపడింది. అయితే స్టార్టప్‌ను ప్రారంభించడం, టైర్ 2 మరియు టైర్ 3 లలో కళాశాలలను చేరుకోవడం ఒక సవాలుగా మారింది. ''మా క్రెడిబిలిటీని పెంపొందించుకోవడానికే మేము ప్రొఫైల్ బిల్డర్ ప్రోగ్రామ్ని ప్రారంభించాము. కార్పొరేట్లు మా క్లయింట్లుగా మారాలని మా నుండి రిక్రూట్మెంట్లను కోరుకున్నారు. అందుకే మేము టైర్ 1 కాలేజీలతో ప్రారంభించాము. నెమ్మదిగా ఎదుగుతున్నాము. కాబట్టి విద్యార్థులకు, కార్పొరేట్లకు పని చేసే ప్రణాళిక మా వద్ద ఉందని నిరూపించడం మాకు మొదటి సవాలు'' అని కృతిక అంటుంది. కోవిడ్-19 వారికి రెండవ సవాలుగా వచ్చిందని చెబుతుంది.
కోవిడ్ ప్రభావంతో...
''మేము కళాశాలలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము. కానీ వైరస్‌తో కళాశాలలు మూసివేయబడినందున ఆన్-గ్రౌండ్ సెమినార్లను నిర్వహించలేము. ప్రతిదీ వర్చువల్‌గా ఉంది. కళాశాలలు తిరిగి తెరిచే సమయంలో మేము పీక్ సీజన్లోకి ప్రవేశించినప్పుడు కోవిడ్-19 వచ్చి పడింది'' అని ఆమె జతచేస్తుంది. 2019లో 50 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కెరీర్ల్యాబ్స్ నేడు 250 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అందులో 45 శాతం మంది మహిళలు ఉన్నారని కృతిక చెబుతుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో కెరీర్ల్యాబ్స్ దాని మార్కెట్ ఔట్రీచ్, టైర్ 2 నగరాల్లో చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా 10ఎక్స్ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా మరిన్ని పరిశ్రమల భాగస్వామ్య హామీ పొందిన ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లు, భాగస్వామ్యాల కోసం కూడా చూస్తోంది.
దేశంలోని ప్రతి మూలకు
ELEV8 యాప్‌లో రూపొందించబడిన కొత్త భౌగోళిక ప్రాంతాలు, కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. కంపెనీలోని అన్ని కొలమానాలను రెట్టింపు చేయడం, రాబడి, జట్టు పరిమాణం, ప్రాంతాలు లేదా కస్టమర్ బేస్ కావచ్చు, దేశంలోని ప్రతి మూలకు చెందిన మిలియన్ల మంది విద్యార్థులకు సాధికారత కల్పించడం ఈ కంపెనీ లక్ష్యం.