Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండుద్రాక్షలు పోషకాహారానికి గొప్ప మూలం. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, శక్తి, ఇనుము, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. న్యూట్రీషియన్-రిచ్ ఎండుద్రాక్ష పిల్లలకు సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. కిస్మిస్ పిల్లలకు తినిపించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
చాక్లెట్‌కు ప్రత్యామ్నాయం: ఐరన్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండుద్రాక్ష, అనారోగ్యకరమైన చాక్లెట్లు, క్యాండీలకు గొప్ప ప్రత్యామ్నా యంగా ఉపయోగించవచ్చు. ఇవి చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎండు ద్రాక్షలో ఎనర్జీ లెవెల్స్‌ని పెంచి పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం: ఈ డ్రై ఫ్రూట్లో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మలబద్ధక సమస్యలకు చాలా బాగా సహాయపడుతుంది. మీరు ఒక గ్లాసు నీటిలో కొన్ని ఎండుద్రాక్షలను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పిల్లలకు అందించవచ్చు.
రోగనిరోధక శక్తికి: సాధారణంగా పిల్లలు దగ్గు, జలుబుకు గురవుతారు. బలహీనమైన రోగనిరోధక శక్తి వారి సమస్యలను అనేక రెట్లు పెంచుతుంది. అందుకే ఎండు ద్రాక్షను తినిపించడం వల్ల వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ఎండుద్రాక్ష తినడం వల్ల జ్వరం, ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
మెదడు అభివృద్ధి: ఎండు ద్రాక్షను చిన్న పిల్లలకు తినిపిస్తే వారు ఏ విషయాలైనా గుర్తుపెట్టుకునే శక్తి పెరుగుతుంది. మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. దీంతోవారు సరైన పోషకాహారాన్ని పొందుతారు.
ఎప్పుడు ప్రారంభించాలి: మీ బిడ్డకు 8 - 10 నెలల వయసులో ఉన్నప్పుడు ఎండుద్రాక్షను తినడం ప్రారంభించవచ్చు. దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకు తినిపించవచ్చు. ఎండుద్రాక్ష లేదా స్వీట్లను జోడించవచ్చు. ఎండుద్రాక్షను పిల్లలకు తినిపించే ముందు వాటిని బాగా గుజ్జు చేయాలి.