Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్భుతమైన ఔషధ గుణాలున్న బిర్యానీ ఆకుతో డికాక్షన్ చేసుకొని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కషాయాన్ని రోజూ తాగితే అనేక వ్యాధులు దూరమవుతాయి.
ఒళ్లు నొప్పులు మాయం: శరీరంలో నొప్పులకు బిర్యానీ ఆకుల డికాక్షన్ చక్కగా పనిచేస్తుంది. మీకు వెన్నునొప్పి ఉంటే బే ఆకుల కషాయాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తాగాలి. అలాగే బే ఆకు నూనెతో నడుముపై మసాజ్ ఉపశమనం కలుగుతుంది. అలాగే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తిమ్మిర్లు రావు: కాళ్లు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో తిమ్మిరి ఉన్నా.. నరాల్లో వాపు ఉన్నా.. అలాంటి వారు బిర్యానీ ఆకులతో కషాయం చేసుకోవాలి. దానిని కనీసం వారం రోజుల పాటు తాగితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
అధిక బరువుకు చెక్: బే ఆకుల కషాయం శరీరంలో జీవక్రియను మెరుగుపర్చుతుంది. దీని కారణంగా కడుపు ఎక్కవ సమయం పాటు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువగా ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఫలితంగా బరువు తగ్గుతుంది.
ఎలా చేసుకోవాలి: 10 గ్రాముల బిర్యానీ ఆకు, 10 గ్రాముల వాము, 5 గ్రాముల సోంపు తీసుకుని వీటన్నింటిని కలిపి గ్రైండ్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు లీటరు నీరు తీసుకుని అవి మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి మళ్ళీ బాగా మరిగించాలి. నీరు 100-150 ఎం.ఎల్కి తగ్గిన తర్వాత స్టవ్ ఆర్పండి. కషాయాన్ని వడగట్టి.. వేడివేడిగా తాగాలి. ఈ కషాయాన్ని రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప