Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొలకెత్తిన వెల్లుల్లిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు తాజా వెల్లుల్లి కంటే మొలకెత్తిన వెల్లుల్లిలో ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. అందుకే నిపుణులు కూడా మొలకెత్తిన వెల్లుల్లిని తినమని సూచిస్తున్నారు. మరి మొలకెత్తిన వెల్లుల్లితో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం...
మొలకెత్తిన వెల్లుల్లిలో ఎంజైమ్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్లకు దూరంగా ఉండవచ్చు. .
శరీరంలోని ఏదైనా భాగంలో రక్తం సరఫరా సరిగా కాకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ ఎంజైమ్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని వాడడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
మొలకెత్తిన వెల్లుల్లిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ధమనులను వ్యాకోచింపజేసి.. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.
ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా వద్ధాప్య ప్రభావాలను కూడా నివారించవచ్చు. శరీరంపై ముడతలు, మొటిమల సమస్యను కూడా వెల్లుల్లి ద్వారా అధిగమించవచ్చు. ప