Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరేడు వేప ఆకులను తీసుకోండి. దీనికి కొన్ని తులసి ఆకులను జోడించి గ్రైండ్ చేసి అందులో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి అరకప్పు ముల్తానీ మట్టిని కలపండి. బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మంలోని జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.