Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిరోజూ మనం నిద్రలేవగానే మామూలు పనులతోపాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని పనులు చేస్తుంటాము. ఈ విషపూరిత అలవాట్లు మనల్ని నెమ్మదించేలా చేస్తాయి, అవి ప్రతికూలంగా ఉంటాయి. క్రమంగా మన కోపం ఇంట్లోని వ్యక్తులపై, మన పనిపై రుద్దబడుతుంది. కాబట్టి ఈ ప్రమాదకరమైన మార్నింగ్ అలవాట్లను వదిలివేయమంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...
ఫోన్ స్క్రీన్: మనం నిద్రలేవగానే చేసే మొదటి పని మన ఫోన్ స్క్రీన్లను చూడటం. ఇది మన కండ్లను ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇది మన శక్తిని హరిస్తుంది కూడా. బదులుగా ఉదయమే కొద్దిగా గోరువెచ్చని నీరు తాగండి. మీ ముఖం కడుక్కోండి, నిలబడి లేదా బాల్కనీలో లేదా కిటికీ దగ్గర కూర్చుని కొంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. మీ కోసం ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించండి. ఆపై ఫోన్, సోషల్ మీడియా, మీ మెయిల్స్ మొదలైనవాటిని చూడండి.
బ్రేక్ ఫాస్ట్: చాలా మందికి ఈ చెడు అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇది ఎక్కువగా చేస్తుంటారు. ముందు ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత హడావుడిగా అల్పాహారం ఏమీ తినకుండా కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గుడ్డు, టోస్ట్ లేదా ఓట్ మీల్, కొన్ని తాజా పండ్లు మొదలైనవి తీసుకోండి.
ప్రణాళిక: మీ రోజును ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. అది ఆదివారం అయినా, మీరు షాపింగ్ చేయాలనుకున్నా దానికి అనుగుణంగా పని చేయండి. మీ ప్రణాళికలను ఆలస్యం చేయవద్దు. అది ఎప్పటికీ ఫలించదు. బయటికి వెళ్లే ముందు మీకు సమయం దొరికితే మొక్కలకు నీరు పెట్టండి లేదా ఇల్లు, ఫ్రిజ్ శుభ్రం చేయండి.
స్నానం: ప్రజలు తమ రోజును ప్రారంభించే ముందు ఉదయం స్నానం చేయడానికి కారణం ఏమిటంటే అది వారికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. రోజుకి బూస్ట్ ఇస్తుంది. స్నానం చేయడం వల్ల మన శరీరం మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. అధిక పనితీరును అందించే శక్తిని అందిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు: మీరు నిద్ర లేవగానే జీవితంలో ప్రతికూల విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకండి. వ్యాయామం చేయండి. మీ జీవితంలో కలిగి ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞతతో ఉండండి. ఆశాజనకంగా ఉండండి. ఉదయం పూట ఒక ప్రతికూల ఆలోచన ఎల్లప్పుడూ నిరాశకు గురిచేస్తుంది.