Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగంలో ఉన్నచోటే చాన్నాళ్లుగా నిలిచిపోయారా? ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే...
కెరీర్‌కు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం నిరంతరం కొనసాగించాలి. దీనికోసం కొత్త కోర్సులు చేయడం ఒక మార్గం. లింక్డిన్, ఐఎన్సీడాట్కామ్ లాంటి వాటిలో మీ రంగంలో వస్తోన్న మార్పుల్ని తెలుసుకోవచ్చు.
అదే పనిగా సీటుకి అతుక్కుపోకుండా లంచ్, టీ బ్రేక్‌లు తీసుకోండి. దీనివల్ల మెదడుకు కాసేపు విశ్రాంతి దొరికి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. సకాలంలో లక్ష్యాన్ని పూర్తిచేయగలరు. దీంతో బాస్‌కు మీపైన నమ్మకం పెరుగుతుంది.
చాలామంది పనిచేస్తున్నాం కానీ, గుర్తింపు రావడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. గుంపులో ఒకరిగా ఉంటే మీరు కోరుకున్న గుర్తింపు ఎప్పటికీ రాకపోవచ్చు. ప్రాజెక్టుల్లో, సమావేశాల్లో, ప్రత్యేక సందర్భాల్లో అందరికంటే ముందుండాలి. అవకాశం లభించినపుడు మీ ముద్ర చూపించాలి.
పొరపాట్లు జరుగుతాయేమోనని భయపడుతూ చొరవ చూపకుండా, కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఉంటే కెరియర్‌కు నష్టమే. ప్రారంభంలో పొరపాట్లు చేసేవాళ్లు మిగతావాళ్లకంటే వేగంగా నేర్చుకుంటారు. అవి అనుభవ పాఠాలుగా ఉపయోగపడతాయి.