Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవయవాలన్నీ సరిగా ఉంటేనే మహిళను చిన్న చూపు చూస్తున్న సమాజం మనది. ఇక కండ్లు లేకపోతే... అసలే గుర్తించరు. అలాంటిది మొట్టమొదటి సారి మధ్యప్రదేశ్ నుండి చూపులేని అమ్మాయిలు త్వరలో జరగబోయే జాతీయ అంధుల క్రికెట్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్నారు. టోర్నమెంట్ ఫిబ్రవరి 28 నుండి మార్చి 5, 2022 వరకు బెంగళూరులో జరుగుతుంది. అన్ని రకాల అసమానతలను ఎదిరించి ఈ టోర్నమెంట్లో పాల్గొన బోతున్న వారి ఆ జట్టు వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 14 ఇతర జట్లతో పాటు అంధ మహిళల క్రికెట్ జట్టు టోర్నమెంట్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యుడు, ఎంపీ అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ సోనూ గోల్కర్ జాతీయ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఈ యువతులను జట్టుగా ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తున్నారు. అతను పూర్తిగా చూపులేని, పాక్షికంగా అంధులైన యువతులకు కొత్త ఆశను కల్పించాడు. వారిలో కొంతమంది గిరిజన ప్రాంతాలకు చెందినవారు.
గతంలో చూడలేదు
''మేము చాలా కాలంగా రాష్ట్రంలొ అంధ మహిళల బందాన్ని రూపొందించడానికి పని చేస్తున్నాము. కానీ చివరకు గత సంవత్సరం భోపాల్, ఇండోర్లలో ట్రయల్స్‌పై నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 160 మంది బాలికలు పాల్గొనడం ఆశ్చర్యంగా ఉంది. నగరాల నుంచే కాకుండా గిరిజన జిల్లాల్లోని చిన్న గ్రామాల నుంచి కూడా అమ్మాయిలు వస్తున్నారు. మేము గతంలో అబ్బాయిల కోసం కూడా ట్రయల్స్ నిర్వహించాము. కానీ క్రీడలు నేర్చుకోవాలనే ఈ రకమైన బలం, ఉత్సాహాన్ని మేము గతంలో ఎప్పుడూ చూడలేదు'' అని సోను చెబుతున్నారు.
టీం సభ్యులు వీరే...
క్రీడాకారుల్లో నికితా (కెప్టెన్, వికెట్ కీపర్), రవీనా (వైస్ కెప్టెన్), గీత, దీప్శిఖా (బేతుల్ జిల్లా), సుష్మ (దామోV్‌ా జిల్లా), భూరి, అంజలి రావత్, సప్నా అహిర్వార్, విశిక (గ్వాలియర్), అంజలి యాదవ్, ప్రియ, సరితా చౌరేబీ (హౌషంగాబాద్), వర్ష (జబల్పూర్), కోమల్ (ఉజ్జయిని) జట్టుగా ఆడబోతున్నారు. అమ్మాయిలకు సరైన శిక్షణ ఇస్తే ఇదో పెద్ద అవకాశంగా మారుతుందని గ్రహించిన సోనూను ఈ ఉత్సాహం ప్రేరేపించింది.
సవాళ్లను అధిగమిస్తున్నారు
మారుమూల గ్రామాల నుండి వచ్చిన అమ్మాయిలు తమ గ్రామాల నుండి బయటకు రావాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని, వారు అనుభవించే వివక్ష గురించి కూడా అతనికి తెలుసు. వారు కూడా వికలాంగులు కాబట్టి వివక్ష చాలా రెట్లు ఎక్కువ అని ఆయన అంటున్నారు. ''క్రీడల శిక్షణ కోసం వేరొక నగరానికి వెళ్లడానికి వారిని అనుమతించమని తల్లిదండ్రులను ఒప్పించడమంటే పెద్ద పోరాటమే'' అని ఆయన చెప్పారు.
జుట్టు విధానం ఇది
బ్లైండ్ క్రికెట్లో బి1 కేటగిరీలో ఆడేవారే పూర్తిగా చూపులేనివారు అయితే బి2 ప్లేయర్లు పాక్షికంగా అంధులు. వీరికి చూపు మూడు మీటర్ల వరకు కనిపించవచ్చు. బి3 ప్లేయర్లు పాక్షికంగా చూపుతో ఉంటారు. అంటే ఆరు మీటర్ల వరకు చూడగలరు. ఒక జట్టులో కనీసం నలుగురు బి1 ప్లేయర్లు ఉంటారు. వీరు 20 ఓవర్ల ఆటలో 40 శాతం బౌలింగ్ చేస్తారు. ముగ్గురు బి2 ప్లేయర్లు, నలుగురు బి3 ప్లేయర్లు ఉంటారు.
జాతీయ పరుగు ఛాంపియన్ సప్నా
16 ఏండ్ల బి1 క్రీడాకారిణి అయిన గ్వాలియర్‌కు చెందిన సప్నా అహిర్వార్ 2011-2012లో క్రీడల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె జాతీయ పరుగు ఛాంపియన్ పతక విజేత. యోగా పట్ల ఆసక్తి ఉన్న ఆమె అంధులు, దష్టిగల వ్యక్తులతో తన సొంత యోగా బందాన్ని సష్టించింది. రాష్ట్ర స్థాయి పోటీలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె క్రికెట్లో సోనుని తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. తాను అనధికారికంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు గత సంవత్సరం సోను జట్టును నిర్మించడానికి బయలుదేరినప్పుడు మాత్రమే అంధ మహిళల క్రికెట్ గురించి తనకు తెలిసిందని చెప్పింది.
ఆశ కోల్పోలేదు
మూడవ తరగతి చదువుతున్నప్పుడు సప్నా కంటి నాడికి దెబ్బతగలడంతో ఆమె పూర్తిగా చూపు కోల్పోయింది. అది ఆమె తల్లిదండ్రులను చాలా ఆందోళనకు గురిచేసినప్పటికీ సప్నా ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ''నేను చేయాల్సింది చాలా ఉంది. నేను తబలా ప్లేయర్‌గా మారాలనుకుంటున్నాను. ఇప్పుడు క్రికెట్‌కు కూడా చాలా ప్రాధాన్యం పెరిగింది. నా చదువులు అలాగే సాగాయి. ఇక నా అంధత్వం గురించి ఆందోళన చెందడానికి సమయం ఎక్కడ ఉంది? నా వైకల్యం కారణంగా ప్రజలు నా నుండి ఆశించే దానికంటే చాలా ఎక్కువ చేయగలను అని నాకు తెలుసు'' అంటూ సప్నా నొక్కి చెప్పింది.
హాస్టల్లో ఉంటూ...
ఆమె తన ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉన్న హాస్టల్లో నివసిస్తుంది. అక్కడ ఉండడం వల్ల ఆమెకు చాలా అవకాశాలు లభిస్తాయని తెలుసుకుంది. ''అంధుల కోసం నా వాట్సాప్ గ్రూప్‌లో అంధ మహిళల బందానికి ట్రయల్‌ని పిలుస్తూ సందేశం వచ్చింది. నేను వెళ్లేందుకు మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ నా హాస్టల్ వార్డెన్, నేనూ కలిసి నాకు ఇది మంచి అవకాశం అని మా తల్లిదండ్రులను ఒప్పించాను. నా హాస్టల్ వార్డెన్‌పై ఉన్న నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించారు'' అని ఆమె చెబుతుంది. ఆమె పాఠశాలకు చెందిన ఆరుగురు బాలికలు టెస్టింగ్ కోసం హాజరయ్యారు.
జూడో క్రీడాకారిణి అంజలి యాదవ్
ఎంపీలోని హౌషంగాబాద్ జిల్లాలోని కేస్లా ఖుర్ద్ గ్రామంలో చదువుతున్న బి2 క్రీడాకారిణి అంజలి యాదవ్ జూడో క్రీడాకారిణి. ఆమె ఇప్పుడు క్రికెట్లో తన ప్రతిభను కనబరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె జూడోలో జాతీయ స్థాయి క్రీడాకారిణి. రెండు పతకాలు కూడా గెలుచుకుంది. అంధ బాలికల క్రికెట్ ట్రయల్స్ గురించి తన స్నేహితురాలు తనకు చెప్పిందని, వెంటనే తాను ఉద్వేగానికి గురయ్యానని అంజలి చెప్పింది.
అవకాశాలు పదే పదేరావు
''నేను ట్రయల్స్‌కు వచ్చి సోనూ సర్ని కలిశాను. అతను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడగలడని నేను గ్రహించాను. మరి నేను ఎందుకు చేయలేను? జీవితం అలాంటి అవకాశాలను పదే పదే ఇవ్వదు. అవి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను నమ్ముతున్నాను'' అని అంజలి చెబుతుంది. ఆమె ట్రయల్స్‌కు రావడానికి అనుమతించమని తల్లిదండ్రులను ఒప్పించడంలో పెద్దగా సమస్యలేమీ ఎదుర్కోలేదు. ''నా తల్లిదండ్రులు మద్దతుగా ఉన్నారు. వారు కూడా నేను ఏదో సాధించాలని కోరుకుంటారు'' ఆమె చెప్పింది.
మొదట కష్టంగా...
ప్రారంభంలో అంజలి ఈ క్రీడను చాలా కష్టంగా భావించింది. ''నేను మొదట్లో క్రికెట్‌ను ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. బ్యాటింగ్, బౌలింగ్ చాలా కష్టంగా ఉంది. కానీ నెమ్మదిగా దానిని హ్యాంగ్ చేసాను'' అని ఆమె చెబుతుంది. తాను రాష్ట్ర జట్టులో, తర్వాత జాతీయ స్థాయికి ఎంపిక కాగలననే నమ్మకంతో ఉంది. తన జట్టు కూడా అలాంటి విజయం సాధిస్తుందని చెబుతుంది.
రాబోయే టోర్నీపై ఆశలు పెట్టుకున్నారు
వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (డబ్ల్యూబిసిసి)కి అనుబంధంగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) బెంగళూరులో ప్రధాన కార్యాలయంగా ఉన్న సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్డ్కు అనుబంధ సంస్థ. మధ్యప్రదేశ్‌లోని అంధుల క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తుంది. స్థానిక ఆటగాళ్ల కోసం స్పాన్సర్‌షిప్‌లు, నిధులను కూడా సేకరిస్తానని సోనూ పంచుకున్నాడు. జాతీయ టోర్నమెంట్ సమీపిస్తున్నందున జట్టు ఎంపిక, శిక్షణ కోసం కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ అది సోను విశ్వాసాన్ని అడ్డుకోలేదు.
ఫైనల్‌కు చేరుకుంటారని
''నా కంటే ఎక్కువగా, పాల్గొనడానికి ఉత్సాహంగా ప్రేరేపించబడిన వారు జట్టులో ఉన్నారు. అది నాకు ఆశను ఇస్తుంది. వారు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ నేను సంతోషంగా ఉంటాను. వారు ఫైనల్‌కు చేరుకుంటారని నేను వారికి చెప్పాను. వారు రోజు విడిచి రోజు సాధన చేస్తున్న విధానం గొప్ప పరిపూర్ణత కలిగించే విషయం'' అని ఆయన పంచుకున్నారు. జాతీయ టోర్నమెంట్లో వారి ప్రదర్శన తర్వాత సోను వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌పై ఇప్పటికే దష్టి పెట్టాడు. రాష్ట్ర జట్టు నుండి కనీసం ఇద్దరు యువతులను జాతీయ జట్టుకు పంపాలని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
- సలీమ